News April 8, 2025
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏడాదికి రూ.96 కోట్ల భారం

వంట గ్యాస్ ధరలను సిలిండర్‌కు రూ.50 పెంచుతూ కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.826గా ఉంది. దీనిపై డెలివరీ ఛార్జీలు అదనంగా వసూలు చేస్తున్నారు. తాజాగా కేంద్రం పెంచిన ధరతో అసలు ధర రూ. 876కి పెరగనున్నది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 16లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉండగా ఒక్కొ సిలిండర్‌పై నెలకు రూ.50 చొప్పున రూ.8 కోట్లు, ఏడాదికి రూ.96 కోట్ల భారం మోపనున్నారు.
Similar News
News January 14, 2026
GNT: సరస్ మేళా ఫుడ్ కోర్టుకు పోటెత్తిన జనం!

గుంటూరు సరస్ మేళా ఫుడ్ కోర్టు ఆహార ప్రియులతో కిటకిటలాడుతోంది. ఏపీతో పాటు 12 రాష్ట్రాల రుచులు ఇక్కడ నోరూరిస్తున్నాయి. జమ్మూ కబాబ్స్, హైదరాబాద్ బిర్యానీ, కేరళ ఫ్రూట్ సలాడ్స్, అరకు కాఫీ వంటి వెజ్, నాన్ వెజ్ వంటకాలను జనం ఇష్టంగా ఆస్వాదిస్తున్నారు. సెలవుల్లో రద్దీ పెరిగిందని, ప్రభుత్వ ప్రోత్సాహంతో మంచి వ్యాపారం జరుగుతోందని డ్వాక్రా మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.
News January 14, 2026
GNT: కిటకిటలాడుతున్న సరస్ ప్రదర్శన ప్రాంగణం

గుంటూరులో జరుగుతున్న సరస్ మేళా-2026 అఖిల భారత డ్వాక్రా బజారుకు విశేమైన ఆదరణ లభిస్తోంది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ప్రతిరోజూ వేల సంఖ్యలో సందర్శకులు స్టాళ్లను సందర్శిస్తున్నారు. దేశ నలుమూలల నుంచి వచ్చిన స్టాల్స్ మాత్రమే కాకుండా సందర్శకుల కోసం సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. ఉత్పత్తులతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఆలరిస్తున్నాయని సందర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News January 14, 2026
‘మన మిత్ర’తో వాట్సాప్‌లోనే పోలీస్ సేవలు: ఎస్పీ

గుంటూరు జిల్లాలో ‘మన మిత్ర-వాట్సాప్ గవర్నెన్స్’ ద్వారా సులభంగా పోలీస్ సేవలు పొందవచ్చని ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం తెలిపారు. ఇకపై ఎఫ్ఐఆర్ కాపీ, స్టేటస్, ఈ-చలానా వివరాల కోసం స్టేషన్‌కు వెళ్లాల్సిన పనిలేదు. 95523 00009 నంబర్‌కు వాట్సాప్‌లో ‘Hi’ అని మెసేజ్ చేస్తే చాలు. మెనూలో పోలీస్ సేవలను ఎంచుకుని వివరాలు పొందవచ్చు. ప్రజలు ఈ సదుపాయాన్ని వాడుకోవాలని ఎస్పీ కోరారు.


