News March 26, 2024
రాజుపాలెం: గడ్డివామి దగ్ధం.. రూ.లక్ష నష్టం

రాజుపాలెంలో మంగళవారం సాయంత్రం గడ్డివామి దగ్ధమైంది. రైతు కాచన జయచంద్ర రెడ్డి పశువుల మేత కోసం గడ్డివామి ఏర్పాటు చేసుకున్నారు. అకస్మాత్తుగా గడ్డివామిలో నుంచి మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల వారు గమనించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ సమాచారాన్ని ప్రొద్దుటూరు అగ్నిమాపక శాఖ అధికారులకు తెలపగా వారు హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేశారు. సుమారు లక్ష రూపాయలు నష్టం జరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News September 7, 2025
చంద్రగ్రహణం.. ఒంటిమిట్ట ఆలయం మూసివేత

ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం ఆలయాన్ని మూసివేయనున్నారు. అలాగే కడప జిల్లాలోని పలు ఆలయాలు పొలతల మల్లేశ్వరస్వామి, పులివెందులలోని వెంకటేశ్వర స్వామి, మిట్ట మల్లేశ్వరస్వామి, రంగనాథస్వామి ఆలయం, గండి వీరాంజనేయస్వామి ఆలయం, నందలూరు సౌమ్యనాథస్వామి ఆలయం మూసివేయనున్నట్లు గండి EO వెంకటసుబ్బయ్య తెలిపారు.
News September 7, 2025
3 నెలల్లో స్మార్ట్ కిచెన్‌ల నిర్మాణాలు పూర్తి: కలెక్టర్

కడప జిల్లాలోని 33 మండలాల్లో సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ల నిర్మాణాలను మూడు నెలల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని వివిధ మండలాల్లో స్మార్ట్ కిచెన్ నిర్మాణాల అంచనాలు, టెండర్లు, మెటీరియల్ సంబంధిత అంశాలపై వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. 3 నెలల్లో పూర్తయ్యేలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించాలన్నారు.
News September 7, 2025
కడప జిల్లాను ప్రథమ స్థానంలోకి తేవాలి: కలెక్టర్

నీతి అయోగ్ నిర్దేశించిన అంశాల్లో జిల్లాను ప్రథమ స్థానంలోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆకాంక్ష జిల్లా, ఆకాంక్ష బ్లాకుల్లో ఆరు విభాగాల్లో లక్ష్యాలను సాధించిన నేపథ్యంలో సంబంధిత భాగస్వామ్య శాఖల అధికారులు, ఫ్రెంట్ లైన్ అధికారులు, సిబ్బందిని అభినందిస్తూ శనివారం కడపలోని ఓ కన్వెన్షన్ హాలులో “సంపూర్ణత అభియాన్ సత్కార కార్యక్రమం” జరిగింది.