News April 8, 2025

కేయూ: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

image

కాకతీయ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 258 పోస్టులకు గానూ 77 మంది మాత్రమే పని చేస్తున్నారు.ఇంకా 181 ఖాళీలు ఉన్నాయి. అకడమిక్‌ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.

Similar News

News July 7, 2025

ముల్డర్ సరికొత్త చరిత్ర

image

జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా క్రికెటర్ వియాన్ ముల్డర్ సంచలనం నమోదు చేశారు. అరంగేట్ర టెస్టులోనే ట్రిపుల్ సెంచరీ బాదిన తొలి కెప్టెన్‌గా నిలిచారు. 297 బంతుల్లో 38 ఫోర్లు, 3 సిక్సర్లతో ఈ మార్క్ చేరుకున్నారు. టెస్టుల్లో ఇది రెండో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ. అంతకుముందు సెహ్వాగ్ 278 బంతుల్లో ఈ ఘనత అందుకున్నారు.

News July 7, 2025

2047 నాటికి పేదరికాన్ని నిర్మూలిస్తాం: మంత్రి కందుల

image

ఆంధ్రప్రదేశ్ విజన్ యాక్షన్ ప్లాన్-2047లో భాగంగా ఉపాధి, సాంఘిక గౌరవం, పేదరిక నిర్మూలన, సుస్థిర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు రూపొందించిన P-4 కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తుందని మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. సోమవారం నిడదవోలులో మంత్రి మాట్లాడారు. 2047 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలనే దీర్ఘకాలిక లక్ష్యంతో P-4 రూపొందించినట్లు చెప్పారు.

News July 7, 2025

పెద్దపల్లి: అర్జీల పరిష్కారంలో వేగం పాటించండి: కలెక్టర్

image

పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డి.వేణుతో కలిసి ప్రజల దరఖాస్తులు స్వీకరించారు. సుల్తానాబాద్‌కు చెందిన రాములు భూమి గల్లంతు అంశంపై, రామగుండం 8 ఇంక్లైన్‌కి చెందిన రాజమ్మకు భూసేకరణ పరిహారం సమస్యపై వచ్చిన ఫిర్యాదులకు తహశీల్దార్లకు రాసి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.