News April 8, 2025

అన్నమయ్య : డిప్యూటీ కలెక్టర్ మృతి.. ప్రమాదం జరిగింది ఇలా..!

image

పీలేరు హంద్రీనీవా సుజల స్రవంతి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తున్న రమ (56) మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె సోమవారం ఉదయం రాయచోటిలో జరిగే ప్రజాసమస్యల పరిష్కార వేదికకు కారులో వెళ్తుండగా సంబేపల్లిలోని ఎర్రగుంట్ల బస్టాండ్ సమీపంలో, గల్ఫ్‌కు వెళ్లేందుకు చెన్నై వెళ్తున్న కారు ఢీ కొట్టింది. రమ అక్కడికక్కడే చనిపోగా.. ఆమె డ్రైవర్ ముబారక్, అటెండర్ జీరూనాయక్, ఢీ కొట్టిన కారు డ్రైవర్ గాయపడ్డారు.

Similar News

News January 13, 2026

సంక్రాంతి వేళ 12 ప్రత్యేక రైళ్లు.. రిజర్వేషన్ అక్కర్లేదు!

image

AP: సంక్రాంతి పండుగ నేపథ్యంలో రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా విశాఖ-విజయవాడ మధ్య 12 జన్ సాధారణ్ ట్రైన్స్ నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రకటించింది. ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగించనున్నట్టు తెలిపింది. జనవరి 12,13,14,16,17,18 తేదీలలో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

News January 13, 2026

ఊటనేల దున్నినా, మట్టి పిసికినా, ఫలితం బురదే

image

ఊటనేల ఎప్పుడూ నీరు ఊరుతూ ఉండే, సహజంగానే చిత్తడిగా ఉండే భూమి. ఆ నేలలో ఎంత కష్టపడి నాగలితో దున్నినా లేదా చేతులతో మట్టిని పిసికి గట్టి పరచడానికి ప్రయత్నించినా దాని స్వభావం మారదు. చివరికి మిగిలేది గట్టిపడని, వ్యవసాయానికి పనికిరాని బురద మాత్రమే. కొన్నిసార్లు కొందరి మనుషుల స్వభావాన్ని ఎంత మార్చాలని ప్రయత్నించినా అవి మారవు. దాని వల్ల మన శ్రమే వృథా అవుతుందని ఈ సామెత చెబుతుంది.

News January 13, 2026

ఇద్దరికి నాలుగేళ్లు జైలు శిక్ష: శ్రీ సత్యసాయి ఎస్పీ

image

దొంగతనం కేసులో ఇద్దరికి కోర్టు నాలుగేళ్లు జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించినట్లు ఎస్పీ సతీశ్ కుమార్ వెల్లడించారు. పుట్టపర్తి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సోమవారం తీర్పు వెల్లడించినట్లు తెలిపారు. ఆరేళ్ల కిందట అమర్నాథ్ నాయుడు, కరుణాకర్ నాయుడుపై కొత్తచెరువులో దొంగతనం కేసు నమోదయిందన్నారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత న్యాయస్థానం తీర్పు వెలువరించిందన్నారు.