News April 8, 2025

BREAKING..శామీర్‌పేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

image

శామీర్‌పేట్‌లోని జీనోమ్ వ్యాలీ PS పరిధిలో లాల్‌గడి మలక్‌పేట్ హైవేపై సఫారీ కారు డీసీఎం ఢీ కొన్నాయి. సఫారీ వాహనం సిద్దిపేట నుంచి నగరానికి వస్తుండగా డివైడర్‌కు తగిలి ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. ఏడుగురికి గాయాలయ్యాయి. మృతులు సిద్దిపేట జిల్లా వర్గల్‌కు చెందిన రాజు, తుర్కపల్లి పరిధి మురహరిపల్లికి చెందిన శ్రవణ్‌లుగా పోలీసులు గుర్తించారు.

Similar News

News January 10, 2026

అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు.. అయినా ఎందుకు కొంటోంది?

image

ప్రపంచంలో ఎక్కువగా <<18798755>>చమురు<<>> ఉత్పత్తి చేసేది అమెరికానే. 2025లో రోజూ 1.34 కోట్ల బ్యారెళ్ల క్రూడాయిల్ అమ్మింది. అయినా ఇతర దేశాల నుంచి ఆయిల్ ఎందుకు కొంటోంది? తమ దగ్గర ఉత్పత్తి అయ్యే లైట్ క్రూడ్‌ విలువ ఎక్కువ కావడమే కారణం. తేలికపాటి ముడి చమురును అధిక ధరకు అమ్మి, హెవీ క్రూడ్‌ను తక్కువకే కొంటోంది. హెవీ క్రూడ్‌ను శుద్ధి చేసే రిఫైనరీలు USలో ఉండటం మరో కారణం. 2025లో 20L బ్యారెళ్లను కొనుగోలు చేసింది.

News January 10, 2026

మెదక్: బాలల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలి: కలెక్టర్

image

బాలల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శనివారం మెదక్ జిల్లా కేంద్రంలోని బాలల సదనం సందర్శించారు. అక్కడి పిల్లల సౌకర్యాలు, విద్య, పోషకాహారం వంటి విషయాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అందిస్తున్న మెనూ, నిత్యావసర వస్తువులను పరిశీలించారు. బాలల వారి సంక్షేమం, ఉన్నత భవిష్యత్‌కు ఆసక్తిని, గమనించి ‌వారి అభివృద్ధికి చేదోడుగా ఉండాలన్నారు.

News January 10, 2026

పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు: సీపీ రాజశేఖర్ బాబు

image

చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు హెచ్చరించారు. 18 నెలల్లో పోక్సో చట్టం కింద నమోదైన 44 కేసుల్లో నిందితులకు తప్పనిసరిగా శిక్ష పడేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ కేసుల్లో 4 మందికి జీవిత ఖైదు, 11 మందికి 20 ఏళ్లు, 7 మందికి 10 ఏళ్లు, మరో 22 మందికి 10 ఏళ్లలోపు జైలు శిక్షలు న్యాయస్థానాలు విధించినట్లు తెలిపారు.