News April 8, 2025

PDPL: కుమార్తె ప్రేమ పెళ్లి.. తండ్రి సూసైడ్

image

అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడంతో తండ్రి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి(D) జూలపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్ఐ సనత్‌కుమార్ వివరాలిలా.. మండల కేంద్రానికి చెందిన అజ్గర్ పాషా(43)కు ఇద్దరు కుమార్తెలు కాగా, చిన్న కుమార్తె స్థానిక యువకుడిని ఇటీవల ప్రేమవివాహం చేసుకుంది. దీంతో మనస్తాపం చెందిన తండ్రి గడ్డిమందు తాగి, సోమవారం మృతి చెందాడు.

Similar News

News November 10, 2025

ఉమ్మడి నిజామాబాద్ ప్రజలకు అలర్ట్

image

రాష్ట్రంలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. ఈ నెల 11 నుంచి 19 వరకు ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిడ్‌కు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. అటు పొగమంచు ప్రభావం ఉంటుందని, వాహనదారులు నిదానంగా వెళ్లాలని సూచించారు. వృద్ధులు, చిన్నారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News November 10, 2025

ఏలూరు: నేడు పీజీఆర్ఎస్‌కు కలెక్టర్ దూరం

image

ఏలూరు ప్రాంగణం గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ పాల్గొనరని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు ఆదివారం తెలిపారు. మొంథా తుఫాన్ కారణంగా ఏర్పడిన నష్టాన్ని పరిశీలించడానికి కేంద్ర బృందం వస్తున్న నేపథ్యంలో, ఆ బృందం వెంట కలెక్టర్, జేసీ ఉంటారని ఆయన వివరించారు.

News November 10, 2025

షీలా నగర్ జంక్షన్‌లో యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

షీలా నగర్ జంక్షన్‌లో ఆదివారం రాత్రి బైక్‌పై వెళుతున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతిచెందిన వ్యక్తి తల పూర్తిగా నుజ్జునుజ్జు అవ్వడంతో గుర్తించడానికి వీలు లేని విధంగా అయిపోయింది. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియల్సి ఉంది. గాజువాక ట్రాఫిక్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.