News April 8, 2025
శాతవాహన వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ!

శాతవాహన యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 39మంజూరు పోస్టులకు గాను 16మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇంకా 21 ఖాళీలు ఉన్నాయి. అకడమిక్ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.
Similar News
News November 12, 2025
HYD: 50 మందికి కార్నియా మార్పిడి.. కొందరు వెయిటింగ్

HYDలోని సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు నాటికి దాదాపు 50 మందికి కార్నియా మార్పిడి చేసి కొత్త జీవితం ప్రసాదించినట్లు తెలిపారు. మరో 50 మంది వరకు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారు. తాజాగా ఆర్టీసీతో ఆస్పత్రి ఒప్పందం కుదుర్చుకోగా గ్రామీణ ప్రాంతాల్లో స్వీకరించిన కార్నియాలను సరోజిని దేవి ఆస్పత్రికి తరలిస్తున్నారు.
News November 12, 2025
విచారణకు పూర్తి స్థాయిలో సహకరించా: ధర్మారెడ్డి

AP: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సీబీఐ సిట్ రెండో రోజు 8 గంటలపాటు విచారించింది. విచారణకు తాను పూర్తిస్థాయిలో సహకరించినట్లు ధర్మారెడ్డి మీడియాకు తెలిపారు. ‘అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సవివరంగా సమాధానం చెప్పా. గతంలో టీటీడీలో బాధ్యతలు నిర్వర్తించిన అధికారులందరినీ ప్రశ్నిస్తున్నారు. అందులో భాగంగానే నన్నూ విచారించారు’ అని మీడియాకు తెలిపారు.
News November 12, 2025
కాణిపాక ఆలయానికి రూ.1.06 కోట్ల ఆదాయం

కాణిపాకంలో ఆన్‌లైన్, సీల్డ్ టెండర్లు, బహిరంగ వేలాలు బుధవారం నిర్వహించారు. ఈక్రమంలో దేవస్థానానికి మొత్తం రూ.1,06,99,997 ఆదాయం లభించింది. షాపింగ్ కాంప్లెక్స్, హోటల్ లైసెన్స్ హక్కు రూ.54.63 లక్షలు, పాదరక్షల భద్రపరుచుకునే హక్కు రూ.24.56 లక్షలు, వినాయక సదన్ హోటల్ లైసెన్స్ హక్కు రూ.27.10 లక్షలు, కళ్యాణమండపం షాపు హక్కు రూ.70 వేలు పలికిందని ఈవో పెంచల కిషోర్ వెల్లడించారు.


