News April 8, 2025
VKB: భార్యను పంపకపోవడంతో మామను హత్య చేసిన అల్లుడు

దోమ మండలంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. పుట్టింటికి వెళ్లిన భార్యను పంపకపోవడంతో మామపై కక్ష పెంచుకుని హత్య చేసినట్లు నిందితుడు ఎడ్ల మల్లేశ్ అంగీకరించాడని పరిగి సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం రాత్రి నిద్రిస్తున్న మొగులయ్యను అల్లుడు మోత్కూర్ వాసి మల్లేష్ హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు. భార్యాభర్తల విషయంలో మామ అడ్డు వస్తున్నాడని కక్షతో గొడ్డలితో నరికి చంపినట్లు వివరించారు.
Similar News
News April 19, 2025
వినుకొండ: రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన విద్యార్థి జీవితంలో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే వినుకొండ (M) పెదకంచర్లకు చెందిన దీప్తి అమెరికాలో MS చదువుతోంది. ఈ నెల 12న స్నేహితురాలితో కలిసి రోడ్డుపై వెళ్తుండగా కారు ఢీకొట్టింది. దీంతో తలకు తీవ్ర గాయమైంది. ఈ మేరకు ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇంకో నెల అయితే ఆమె కోర్సు పూర్తి అవుతుంది. అంతలోనే తీవ్ర విషాదం నెలకొంది.
News April 19, 2025
శ్రీనగర్ SSPగా కర్నూల్ వాసి.!

కర్నూలు జిల్లాకు చెందిన డాక్టర్ సందీప్ చక్రవర్తి జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ SSPగా నియమితులయ్యారు. శుక్రవారం జరిగిన IPS అధికారుల బదిలీల్లో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆయనను శ్రీనగర్ SSPగా నియమించింది. కర్నూలు జిల్లాకు చెందిన ఆయన కీలక పదవుల్లో చేయడంపై చిన్ననాటి సన్నిహితులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
News April 19, 2025
వరంగల్: ‘అత్తాన, పోతాన’.. ఇదే మన యాస, భాష

ప్రాంతాన్ని బట్టి భాష మాట్లాడే తీరు ఉంటుంది. WGL, KNR జిల్లాల్లో మాత్రం భాష కాస్త భిన్నంగా ఉంటుంది. KNRలో అకారంతో మాట్లాడితే WGLలో ఒకారంతో మాట్లాడతారు. KNRలో వడ్లు అంటే WGLలో ఒడ్లు అంటాం. వేరే జిల్లాల్లో వస్తున్నా, వెళ్తున్నా అంటే మనం మాత్రం ‘అత్తాన, పోతాన’ అంటుంటాం. అచ్చిన, అట్లనా, అవ్వ, నాయిన, అప్పయ్య, బాపు, జరఆగు, షానా(చాలా), పైలం, బువ్వ అనేపదాలు వాడుతుంటాం. మీరెలా మాట్లాడుతారో కామెంట్ చేయండి.