News April 8, 2025
BREAKING: దేవరకద్రలో 3 ప్రైవేట్ హాస్పిటల్స్ సీజ్..!

దేవరకద్ర మండల కేంద్రంలోని RMP ప్రైవేటు ఆసుపత్రులను రాష్ట్ర వైద్య బృందం సోమవారం తనిఖీ చేసింది. కొందరు నకిలీ RMP డాక్టర్లు ఎలాంటి అర్హత లేకుండా ప్రజలకు వైద్యం చేస్తున్నారని గుర్తించారు. ఈ మేరకు పట్టణంలోని సత్యసాయి క్లినిక్, సత్యశిలారెడ్డి అమ్మ క్లినిక్, శ్రీసాయి క్లినిక్‌ను సీజ్ చేశామని చెప్పారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోన్న నకిలీ డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
Similar News
News April 19, 2025
గద్వాల: ‘మంత్రి రాకతో రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు’

గద్వాల జిల్లాలో భూభారతి అవగాహన కార్యక్రమంలో ఈ రోజు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో గద్వాల జిల్లా కేంద్రంలో అధికారులు గుంతలు ఉన్న ప్రధాన రోడ్డులకు మట్టి వేసి చేతులు దులుపుకున్నారు. అధ్వానంగా ఉన్న రోడ్లు వల్ల జిల్లా ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నా అధికారులు మాత్రం స్పందించలేదని, మంత్రి వస్తున్న నేపథ్యంలో రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారని జిల్లా ప్రజలు ఆరోపిస్తున్నారు.
News April 19, 2025
హాజీపూర్: ‘ప్రజా సంక్షేమాన్ని బీజేపీ ప్రభుత్వం మర్చిపోయింది’

ప్రజా సంక్షేమాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మర్చిపోయిందని మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు అన్నారు. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్, కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం హాజీపూర్ మండలంలోని ర్యాలీ నుంచి గడ్పూర్ వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. రాజ్యాంగాన్ని దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని, రాజ్యాంగాన్ని కాపాడుకుందామని ఆమె సూచించారు.
News April 19, 2025
ప్రాజెక్ట్ చీతా: భారత్‌కు మరో 8 చిరుతలు

ప్రాజెక్ట్ చీతాలో భాగంగా భారత్ మరో 8 చిరుతలను సౌథర్న్ ఆఫ్రికా దేశాల నుంచి తీసుకురానుంది. తొలి దశలో బోత్స్వానా నుంచి వచ్చే నెలలో నాలుగు చిరుతలు వస్తాయని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) అధికారులు తెలిపారు. 2022లో నమీబియా నుంచి 8, 2023లో SA నుంచి 12 చిరుతల్ని తీసుకువచ్చారు. ప్రస్తుతం కునో నేషనల్ పార్క్‌లో(MP) మొత్తం 26 చిరుతలు ఉన్నాయి.