News April 8, 2025

BREAKING: దేవరకద్రలో 3 ప్రైవేట్ హాస్పిటల్స్ సీజ్..!

image

దేవరకద్ర మండల కేంద్రంలోని RMP ప్రైవేటు ఆసుపత్రులను రాష్ట్ర వైద్య బృందం సోమవారం తనిఖీ చేసింది. కొందరు నకిలీ RMP డాక్టర్లు ఎలాంటి అర్హత లేకుండా ప్రజలకు వైద్యం చేస్తున్నారని గుర్తించారు. ఈ మేరకు పట్టణంలోని సత్యసాయి క్లినిక్, సత్యశిలారెడ్డి అమ్మ క్లినిక్, శ్రీసాయి క్లినిక్‌ను సీజ్ చేశామని చెప్పారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోన్న నకిలీ డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

Similar News

News January 2, 2026

జిల్లాలో ఎరువుల కొరత లేదు: జేడీ

image

ప్రస్తుత దాళ్వా సీజన్‌లో జిల్లాలో యూరియాతో సహా ఎలాంటి ఎరువుల కొరత లేదని వ్యవసాయ శాఖ జేడీ విజయకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సీజన్‌కు మొత్తం 35,576 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటికే 4,686 టన్నులు సరఫరా చేశామన్నారు. శుక్ర, శనివారాల్లో రైల్వే రేక్ ల ద్వారా మరిన్ని నిల్వలు వస్తున్నాయని వెల్లడించారు. ఎరువుల లభ్యతపై రైతులు ఆందోళన చెందవద్దన్నారు.

News January 2, 2026

Yum! డీల్.. McD, డొమినోస్‌కు గట్టి పోటీ

image

దేవయాని, సపైర్ సంస్థల విలీనంతో మెక్ డొనాల్డ్స్, డొమినోస్‌కు సంస్థలకు గట్టి పోటీ ఉంటుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. USA కంపెనీ Yum!కి చెందిన KFC, పిజ్జా హట్‌లను దేశంలో దేవయాని, సపైర్ వేర్వేరుగా నిర్వహిస్తున్నాయి. ఇప్పుడీ $934 మిలియన్ల డీల్‌తో మెర్జర్ ప్రకటించాయి. దీంతో వీటికి మ్యాన్‌పవర్, కార్గో తదితర కాస్ట్ తగ్గి ఆఫర్స్ సహా కొత్త బై ప్రొడక్ట్స్‌తో ప్రత్యర్థులకు కాంపిటీషన్ ఎక్కువ కావచ్చు.

News January 2, 2026

మంచిర్యాల: ‘వెంటనే రోడ్ల నిర్మాణం చేపట్టాలి’

image

మంచిర్యాల కార్పొరేషన్ పరిధి 38వ డివిజన్ సున్నం బట్టి వాడాలో 40,100,20 ఫీట్ల రోడ్లను వెంటనే నిర్మాణం చేపట్టాలని బీజేపీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. నస్పూర్ జోన్ ప్రధాన కార్యదర్శులు చిరంజీవి సుమన్ యాదవ్ ఆధ్వర్యంలో కాలనీలో ప్రజల వద్ద సంతకాల సేకరణ చేశారు. అనంతరం కార్పొరేషన్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. సరైన రహదారులు లేక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.