News April 8, 2025

కేయూ: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

image

కాకతీయ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 258 పోస్టులకు గానూ 77 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇంకా 181 ఖాళీలు ఉన్నాయి. అకడమిక్‌ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.

Similar News

News November 4, 2025

ప్రతి 40 రోజులకో యుద్ధ నౌక: నేవీ చీఫ్

image

ప్రతి 40 రోజులకు ఒక స్వదేశీ యుద్ధనౌక లేదా జలాంతర్గామిని ఇండియన్ నేవీలోకి చేరుస్తున్నామని చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి వెల్లడించారు. 2035 నాటికి 200కు పైగా వార్ షిప్‌లు, సబ్‌మెరైన్లు కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం 52 నౌకలు భారత షిప్‌యార్డుల్లోనే నిర్మితమవుతున్నాయని తెలిపారు. కాగా ప్రస్తుతం మన వద్ద 145 యుద్ధ నౌకలు, జలాంతర్గాములు ఉన్నాయి.

News November 4, 2025

మన్యం కేఫ్ పరిశీలించిన DRDA పీడీ

image

పార్వతీపురం ఐటీడీఏ పెట్రోల్ బంక్ ఆవరణలో DRDA ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మన్యం కేఫ్‌ను DRDA పీడీ ఎం.సుధారాణి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అమ్మకాలను పరిశీలించారు. మన్యం జిల్లా మహిళా సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులను ఈ కేఫ్ ద్వారా అమ్మకాలు చేపడుతున్నామని, ప్రజలు ఈ ఉత్పత్తులు కొనుగోలు చేసి సహకరించాలని కోరారు.

News November 4, 2025

‘వరద ముంపు నివారణకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి’

image

గ్రేటర్ వరంగల్‌కు వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం చూపడానికి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు డా. సత్య శారద, స్నేహ శబరీష్, జీడబ్ల్యుఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. కుడా కార్యాలయంలో వరద ముంపు నివారణపై సమీక్ష నిర్వహించి, సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.