News April 8, 2025

BREAKING: దేవరకద్రలో 3 ప్రైవేట్ హాస్పిటల్స్ సీజ్..!

image

దేవరకద్ర మండల కేంద్రంలోని RMP ప్రైవేటు ఆసుపత్రులను రాష్ట్ర వైద్య బృందం సోమవారం తనిఖీ చేసింది. కొందరు నకిలీ RMP డాక్టర్లు ఎలాంటి అర్హత లేకుండా ప్రజలకు వైద్యం చేస్తున్నారని గుర్తించారు. ఈ మేరకు పట్టణంలోని సత్యసాయి క్లినిక్, సత్యశిలారెడ్డి అమ్మ క్లినిక్, శ్రీసాయి క్లినిక్‌ను సీజ్ చేశామని చెప్పారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోన్న నకిలీ డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

Similar News

News February 24, 2026

అనంతపురంలో KG టమాటా ఎంతంటే?

image

★ అనంతపురం శివారులోని కక్కలపల్లి మార్కెట్‌లో కిలో టామాటా గరిష్ఠంగా రూ.10 పలుకుతోంది. కనిష్ఠంగా రూ.4, సరాసరి రూ.6తో సోమవారం విక్రయాలు సాగాయి.
★ మార్కెట్ యార్డులో టన్ను చీనీ రూ.25 వేలు, కనిష్ఠంగా రూ.8వేలు పలికింది.

News February 24, 2026

నేడు తిరుపతి పుట్టినరోజు..♥

image

టెంపుల్ సిటీగా ప్రసిద్ధి చెందిన తిరుపతి నేడు 896వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోనుంది. చారిత్రక ఆధారాల ప్రకారం 1130 ఫిబ్రవరి 24న శ్రీరామానుజాచార్యులు శ్రీగోవిందరాజ స్వామి ఆలయ ప్రతిష్ఠ చేయడంతో నగరానికి శంకుస్థాపన జరిగినట్లు శాసనాలు సూచిస్తున్నాయి. అప్పుడే తిరుప్పడి తిరుపతిగా మారింది. 1130లో స్థాపితమైన తిరుపతి నగరానికి 2026 నాటికి 896 సంవత్సరాలు పూర్తయ్యాయి.

News February 24, 2026

పోలవరం: పెద్దపులి సంచారం

image

ఉమ్మడి గోదావరి జిల్లాలో ఇటీవల పెద్దపులి అలజడి సృష్టించడం, అటవీ అధికారులు పులిని బంధించి విశాఖ జూకు తరలించి, తదనంతరం పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టడం తెలిసిందే. అయితే పులిని విడిచిపెట్టి వారం గడవకు ముందే రంప ఏజెన్సీ‌లో జనవాసంలో పులి అలజడి మొదలైంది. సోమవారం పెదగెద్దాడ సమీపంలో పులి సంచరిస్తున్నట్లు సమాచారం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.