News April 8, 2025

HYD- తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్‌న్యూస్

image

HYD- తిరుపతి వెళ్లే ప్రయాణికులకు రైల్వే అధికారులు స్పెషల్ ట్రైన్ ప్రకటించారు. మే 23వ తేదీ వరకు వారానికి 2 సార్లు ఈ ట్రైన్ సేవలందిస్తుంది. చర్లపల్లి నుంచి (07017) శుక్ర, ఆదివారాల్లో, తిరుపతి నుంచి (07018) శని, సోమవారాల్లో నడుస్తుంది. మల్కాజిగిరి, కాచిగూడ, జడ్చర్ల, మహబూబ్‌నగర్, డోన్, కడప, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. చర్లపల్లి నుంచి రాత్రి 9.35కు, తిరుపతి నుంచి సాయంత్రం 4.40కు బయలుదేరుతుంది.

Similar News

News November 9, 2025

డెలివరీ తర్వాత నడుంనొప్పి వస్తోందా?

image

కాన్పు తర్వాత చాలా మంది మహిళల్లో వెన్నునొప్పి ప్రాబ్లమ్స్ వస్తాయి. హార్మోన్లలో మార్పులు, వెయిట్ పెరగడం వల్ల నడుంనొప్పి వస్తుందంటున్నారు నిపుణులు. దీన్ని తగ్గించుకోవాలంటే వ్యాయామం చెయ్యాలి. కూర్చొనే పొజిషన్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సపోర్టింగ్ బెల్టులు, హీటింగ్ ప్యాడ్, ఐస్ ప్యాక్ వాడటం వల్ల నడుంనొప్పిని తగ్గించుకోవచ్చు. అలాగే ఏవైనా బరువులెత్తేటపుడు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

News November 9, 2025

అనంత: ఆడ, మగ మృతదేహాల కలకలం

image

తుంగభద్ర రిజర్వాయర్ నుంచి వచ్చే ఎగువ కాలువ(HLC)లో శనివారం సాయంత్రం 2 మృతదేహాలు తేలియాడుతూ కనిపించాయి. బొమ్మనహాల్(M) నాగలాపురం HLC 116, 117 కిలోమీటర్ల వద్ద ఆడ, మగ మృతదేహాలను స్థానికులు గుర్తించి భయాందోళనకు గురయ్యారు. వెంటనే బొమ్మనహాల్ పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరి వయసు సుమారు 45 ఏళ్లు ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

News November 9, 2025

బాడీ షేమింగ్.. హీరోయిన్‌కు క్షమాపణలు

image

బాడీ షేమింగ్‌కు గురైన తమిళ హీరోయిన్ <<18220614>>గౌరీ<<>> కిషన్‌కు యూట్యూబర్ కార్తీక్ క్షమాపణలు చెప్పారు. ఆమె బరువు గురించి మీడియా సమావేశంలో ప్రశ్న లేవనెత్తినందుకు విచారం వ్యక్తం చేశారు. అయితే తాను అడిగిన ప్రశ్నను తప్పుగా అర్థం చేసుకున్నారని, తన మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరారు. కాగా యూట్యూబర్ ప్రశ్నపై తమిళనాట చర్చనీయాంశంగా మారగా పలువురు సినీ ప్రముఖులు గౌరీకి మద్దతుగా నిలిచారు.