News April 8, 2025

MHBD: యువకుడి మృతి.. జ్ఞాపకంగా విగ్రహావిష్కరణ

image

మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం కాంపల్లి గ్రామానికి చెందిన రేపాల భిక్షపతి అనే యువకుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. అందరితో కలిసి మెలిసి ఉండే భిక్షపతి చిన్న వయసులోనే మృతి చెందడంతో గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యుల జ్ఞాపకంగా సోమవారం అతడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీంతో పలువురు వారిని అభినందించారు.

Similar News

News April 19, 2025

గద్వాల: ‘మంత్రి రాకతో రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు’

image

గద్వాల జిల్లాలో భూభారతి అవగాహన కార్యక్రమంలో ఈ రోజు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో గద్వాల జిల్లా కేంద్రంలో అధికారులు గుంతలు ఉన్న ప్రధాన రోడ్డులకు మట్టి వేసి చేతులు దులుపుకున్నారు. అధ్వానంగా ఉన్న రోడ్లు వల్ల జిల్లా ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నా అధికారులు మాత్రం స్పందించలేదని, మంత్రి వస్తున్న నేపథ్యంలో రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారని జిల్లా ప్రజలు ఆరోపిస్తున్నారు.

News April 19, 2025

హాజీపూర్: ‘ప్రజా సంక్షేమాన్ని బీజేపీ ప్రభుత్వం మర్చిపోయింది’

image

ప్రజా సంక్షేమాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మర్చిపోయిందని మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు అన్నారు. జై బాబు, జై భీమ్‌, జై సంవిధాన్, కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం హాజీపూర్ మండలంలోని ర్యాలీ నుంచి గడ్పూర్ వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. రాజ్యాంగాన్ని దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని, రాజ్యాంగాన్ని కాపాడుకుందామని ఆమె సూచించారు.

News April 19, 2025

ప్రాజెక్ట్ చీతా: భారత్‌కు మరో 8 చిరుతలు

image

ప్రాజెక్ట్ చీతాలో భాగంగా భారత్ మరో 8 చిరుతలను సౌథర్న్ ఆఫ్రికా దేశాల నుంచి తీసుకురానుంది. తొలి దశలో బోత్స్వానా నుంచి వచ్చే నెలలో నాలుగు చిరుతలు వస్తాయని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) అధికారులు తెలిపారు. 2022లో నమీబియా నుంచి 8, 2023లో SA నుంచి 12 చిరుతల్ని తీసుకువచ్చారు. ప్రస్తుతం కునో నేషనల్ పార్క్‌లో(MP) మొత్తం 26 చిరుతలు ఉన్నాయి.

error: Content is protected !!