News April 8, 2025

భువనగిరి: పెరిగిన గ్యాస్ ధరలు.. రూ.1.25 కోట్ల భారం !

image

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. సిలిండర్ ప్రస్తుతం రూ.853 ఉండగా పెరిగిన ధరతో రూ.903కు చేరింది. యాదాద్రి జిల్లాలో 2,49,568 గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. దీంతో గ్యాస్ వినియోగదారులపై సుమారు రూ. 1.25 కోట్ల భారం పడనుంది. ఇది ఉజ్వల పథకం సిలిండర్లకు మాత్రమే వర్తించనుంది. నిత్యావసరాల ధరలు పెరిగిన వేళ.. గ్యాస్ ధర పెరగడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

Similar News

News November 15, 2025

WGL: ఎన్నికల సంఘం మార్గదర్శకాలు విధిగా అమలు చేయాలి!

image

ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నియమావళి విధిగా పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌ రెడ్డి అన్నారు. తెలంగాణలోని అన్ని ఇఆర్‌ఓలు, ఏఆర్‌ఓలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఓటరు జాబితా ప్రత్యేక తీవ్ర సవరణ కార్యక్రమం పురోగతి, పెండింగ్‌లో ఉన్న ఎన్నికల సంబంధిత అంశాలపై ఆయన సమీక్షించారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ భాజ్‌ పాయ్ పాల్గొన్నారు.

News November 15, 2025

నర్సంపేట నుంచి అన్నవరానికి సూపర్ లగ్జరీ బస్సు

image

నర్సంపేట RTC డిపో టూర్ ప్యాకేజీలో భాగంగా నర్సంపేట నుంచి 36 సీట్లు గల సూపర్ లగ్జరీ బస్సును ఈరోజు డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ ప్రారంభించారు. ఈ యాత్ర ద్వారక తిరుమల, పిఠాపురం, అన్నవరం, సింహాచలం, విశాఖపట్నం ఆర్కే బీచ్, అంతర్వేది, యానాం మీదుగా ఈనెల 18న రాత్రి 9 గం. వరకు నర్సంపేట చేరుకుంటుందన్నారు. ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు.

News November 15, 2025

సూర్యాపేట: కారు బీభత్సం.. ముగ్గురికి గాయాలు (UPDATE)

image

సూర్యాపేట-జనగామ హైవేపై నాగారం బంగ్లా సమీపంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా కారు కానిస్టేబుల్‌ను ఢీ కొట్టింది. అనంతరం మరో బైక్‌ను ఢీ కొట్టడంతో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ కారును స్పాట్‌లోనే వదిలిపెట్టి పరారయ్యాడు. కారు నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.