News April 8, 2025
కాగుపాడు సర్పంచ్ సస్పెన్షన్

ఉంగుటూరు మండలం కాగుపాడు సర్పంచ్ కడియాల సుదేష్ణను విధుల నుంచి మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తూ కలెక్టర్ వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీకి సంబంధించి నిధుల దుర్వినియోగం ఆరోపణలపై చర్యలు తీసుకున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఉప సర్పంచ్ విధులు నిర్వర్తించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Similar News
News January 14, 2026
ఖాకీపై ఖద్దరు విజయం.. జిల్లాలో పందెం హోరు!

ఉమ్మడి ప.గో. జిల్లాలో కోడిపందేలకు లైన్ క్లియర్ అయింది. పోలీసుల ఆంక్షలు అమలు కాకపోవడంతో ‘ఖాకీపై ఖద్దరు’ విజయం సాధించినట్లయ్యింది. బుధవారం నుంచి జిల్లావ్యాప్తంగా ప్రధాన బరుల వద్ద పందేలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పందెం రాయుళ్లు భారీగా తరలిరావడంతో బరుల వద్ద కోలాహలం నెలకొంది. వచ్చే మూడు రోజుల పాటు ఈ పందెం జాతర కొనసాగనుండగా.. సంప్రదాయం పేరిట జూదం జోరందుకోవడంతో పల్లెలన్నీ పందెం సెగతో ఊగిపోతున్నాయి.
News January 14, 2026
‘గూడెం’ బరిలో రూ.2 కోట్లు పైమాటే?

తాడేపల్లిగూడెం(M)లో కోడిపందేల నిర్వహణ ఉత్కంఠ రేపుతోంది. గతేడాది ఒకే బరిలో రూ.కోటికిపైగా పందెం జరగగా, ఈసారి అది రూ.2కోట్లు దాటుతుందని సమాచారం. దీంతో పందెం రాయుళ్లంతా ఈ బరిపై ప్రత్యేక దృష్టి సారించారు. గురువారం భారీ స్థాయిలో బెట్టింగ్‌లు జరిగే అవకాశం ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పోలీసులు బరులను ధ్వంసం చేస్తున్నా, లక్షలాది రూపాయల చేతులు మారే ఈ భారీ పందెంపైనే సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.
News January 14, 2026
ప.గో: ‘బరి’లో సస్పెన్స్.. పైచేయి ఖాకీదా? ఖద్దరుదా?

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతీ ఏటా కోడిపందాలు నిర్వహించడం పరిపాటిగా వస్తోంది. అయితే, ఈ ఏడాది భోగి రోజున ఉదయం 10:40 గంటలు కాస్తున్నా, పందాలకు అనుమతులు లభించలేదు. దీంతో పందెం రాయుళ్లు అనుమతుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది పైచేయి ఖాకీదా ? ఖద్దరుదా ? తేలాల్సి ఉంది. మంగళవారం రాత్రి తాడేపల్లిగూడెం(M) కడియద్ద, కొమ్ముగూడెం, పట్టెంపాలెం, తాడేపల్లిగూడెంలోని బరులను ధ్వంసం చేశారు.


