News April 8, 2025
గద్వాల: జమ్మిచేడు జమ్ములమ్మ దీపాల కాంతుల్లో భక్తులకు దర్శనం

జమ్మిచేడు జమ్ములమ్మకు మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కృష్ణా నది జలాలతో అమ్మవారిని అభిషేకించి, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం అర్చన, ఆకుపూజ, హోమం తదితర పూజాలు జరిపారు. భక్తులు, బంధువులతో పెద్దఎత్తున తరలివచ్చి ఆలయ ఆవరణలో జమ్ములమ్మను చేసి సారేతో కురువ డోళ్లు, బైనోల్ల పాటలతో దీపాల కాంతుల్లో అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
Similar News
News November 9, 2025
HYD: ఫ్రాన్స్‌లో MBBS పూర్తి చేసి ఉగ్రవాదం వైపు

ఉగ్రదాడులకు ప్లాన్ చేసిన వారిలో హైదరాబాదీ మొహియుద్దీన్ ఉండటం చర్చనీయాంశమైంది. నిందితుడిని రాజేంద్రనగర్ ఫారెస్ట్ వ్యూస్ కాలనీలోని గుజరాత్ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా అతడు ఫ్రాన్స్‌లో MBBS పూర్తిచేసినట్లు తెలుస్తోంది. ఇంత చదివి ప్రజల ప్రాణాలు బలిగొనే ఉగ్రవాదంవైపు ఆకర్షితులవుతుండటంతో యువతరం ఏమైపోతోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఇంట్లో సోదాలు చేయగా గన్స్ దొరికాయి.
News November 9, 2025
ALERT.. వచ్చే 8 రోజులు జాగ్రత్త!

TG: ఈ నెల 11 నుంచి 19 వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. ADB, కొమురం భీమ్, నిర్మల్, NZB, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు (10°C కంటే తక్కువ) పడిపోవచ్చని అంచనా వేశారు. దక్షిణ, తూర్పు జిల్లాల్లో మోస్తరు చలి, ఉష్ణోగ్రతలు 14°C-17°C మధ్య ఉండవచ్చని పేర్కొన్నారు.
News November 9, 2025
6,000 మందితో గీతా పారాయణం

విశాఖపట్నంలోని పోర్ట్ ఇన్‌డోర్ స్టేడియంలో ఆదివారం భగవద్గీత పారాయణం నిర్వహించారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో 6,000 మందికి పైగా భక్తులు ఏకస్వరంతో 700 శ్లోకాల భగవద్గీత పారాయణం చేశారు. 3 గంటలకు పైగా సాగిన ఈ మహా పారాయణంలో గీతా శ్లోకాలు ప్రతిధ్వనిస్తూ ఈ కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమాన్ని ఓ ఫౌండేషన్-అవధూత దత్త పీఠం నేతృత్వంలో నిర్వహించారు.


