News April 8, 2025

SLBCలో ముమ్మరంగా మట్టి, స్టీల్ తొలగింపు పనులు

image

అమ్రాబాద్ మండలంలోని దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఆరుగురు కార్మికుల మృతదేహాల కోసం ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. మంగళవారం ఉదయం లోకల్ ట్రైన్ శకలాలను బయటకు తరలించడంతోపాటు టన్నెల్‌లో స్టీల్, మట్టి తొలగింపు పనుల్లో రెస్క్యూ బృందాలు వేగం పెంచాయి. కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని టన్నెల్ బయటకు చేరవేసే ప్రక్రియ సమాంతరంగా జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.

Similar News

News July 6, 2025

భీమా సౌకర్యాలను ప్రజలు వినియోగించుకోవాలి: కలెక్టర్

image

పీఎం జీవన జ్యోతి, సురక్ష భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పధకాల ద్వారా భీమా పొందాలని కలెక్టర్ అంబేద్కర్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. అతి తక్కువ ప్రీమియంతోనే ఎక్కువ రక్షణ పొందవచ్చన్నారు. భీమా పథకాలపై సచివాలయాల స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సామాన్య కుటుంబాలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని చెప్పారు.

News July 6, 2025

NGKL: జిల్లా విద్యుత్ ఎస్ఈ సీహెచ్ పౌల్ రాజ్ బదిలీ

image

నాగర్‌కర్నూల్ జిల్లా విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తూ వచ్చిన సీహెచ్ పౌల్ రాజ్‌ను బదిలీ చేస్తూ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను కార్పొరేట్ కార్యాలయానికి బదిలీ చేశారు. ఆయన ఇక్కడ దాదాపు ఏడాది పాటు ఎస్ఈగా విధులు నిర్వహించారు. ఆయన స్థానంలో మరో అధికారిని నియమించాల్సి ఉంది.

News July 6, 2025

కరీమాబాద్‌లో కనుల పండువగా బీరన్న బోనాలు

image

తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కురుమల కుల దైవం బీరన్న బోనాల కనుల పండువగా జరిగాయి. కరీమాబాద్, ఉర్సులోని కురుమ కుల మహిళలు భక్తితో బొనమెత్తారు. బీరప్ప సంప్రదాయంగా గావు పట్టగా బోనాలు బీరన్న గుడికి చేరుకున్నాయి. స్వామి వారికి నైవేద్యం సమర్పించిన తిరుగుముఖం పట్టారు. మంత్రి సురేఖ, మేయర్ సుధారాణి, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.