News April 8, 2025

NGKL: స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం.. DEOకు ఫిర్యాదు

image

నాగర్‌కర్నూల్ జిల్లా నాగనూల్ KGBVలో 9వ తరగతి విద్యార్థిని యామిని చెయ్యి కోసుకుని ఆత్మహత్యకు యత్నించిన సంగతి తెలిసిందే. విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేరే టీచర్‌తో తమ కూతురు మంచిగా ఉంటుందనే అక్కసుతో కళ్యాణి అనే టీచర్ కక్షసాధింపు చర్యలపై మనస్తాపం చెంది యామిని ఆత్మహత్యకు యత్నించిందన్నారు. టీచర్ కళ్యాణిపై చర్యలు చేపట్టాలని DEO రమేశ్ కుమార్‌కు స్టూడెంట్ పేరెంట్స్ ఫిర్యాదు చేశారు.

Similar News

News September 18, 2025

జూబ్లీహిల్స్‌లో ‘కలర్ ఫొటో’కు అవకాశం?

image

త్వరలో బిహార్‌లో జరిగే ఎన్నికల్లో అభ్యర్థుల కలర్ ఫొటోలను ఈవీఎంలలో ఉపయోగించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం త్వరలో జరిగే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో అమలు చేస్తారో? లేదో? కమిషన్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే కలర్ ఫొటో గురించి ఇప్పటికే అన్ని రాష్ర్టాలకూ ఈసీ లేఖలూ రాసింది. ఇదే జరిగితే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వాడే EVMలలో అభ్యర్థుల కలర్ ఫొటో చూసి ఓటేయవచ్చన్న మాట.

News September 18, 2025

KNR: జిల్లాస్థాయి “కళోత్సవ్” పోటీల్లో కలెక్టర్

image

KNR జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి కళోత్సవ్ పోటీలను కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు ఈ కళా పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. సంగీతం, నృత్యం, కథ, దృశ్య కళలు వంటి 12కేటగిరీల్లో పోటీలు జరుగుతున్నాయన్నారు. మండలస్థాయి పోటీల్లో గెలుపొందిన వారికి బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లాస్థాయి పోటీలు ప్రారంభించారు.

News September 18, 2025

గుండ్లవాగులో ఘనంగా బతుకమ్మ వేడుకలు!

image

పువ్వుల పండుగకు వేలయ్యింది. ములుగు జిల్లా కేంద్రంలోని తోపుకుంట, రామప్ప జంగాలపల్లి, ఏటూరునాగారంలోని బొడ్రాయి, రామాలయం, బస్టాండ్ తాడ్వాయిలోని మేడారం, కాల్వపల్లి, మంగపేటలోని రాజుపేట, తిమ్మంపేట, గోవిందరావుపేటలోని పస్రా, గుండ్లవాగు, రాళ్లవాగు, దెయ్యాలవాగు, వెంకటాపురంలోని వేంకటేశ్వర స్వామి ఆలయం, కన్నాయిగూడెం-రామాలయం, వాజేడులోని బొగత వద్ద బతుకమ్మ వేడుకలు జరుగుతాయి. మీ గ్రామంలో వేడుకలు ఎక్కడ జరుగుతాయి?