News March 26, 2024

గుజరాత్‌పై CSK ఘనవిజయం

image

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో CSK 63 రన్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన CSK 20 ఓవర్లలో 206/6 రన్స్ చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన GTలో సుదర్శన్(37), మిల్లర్(21), సాహా(21) తప్ప ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 143/8 రన్స్ మాత్రమే చేసింది. CSK బౌలర్లలో చాహర్, ముస్తఫిజుర్, దేశ్‌పాండే తలో 2 వికెట్లు తీయగా.. మిచెల్, పతిరాణాలకు చెరో వికెట్ దక్కింది.

Similar News

News March 10, 2026

యాసిడ్ దాడి బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేరా?: SC

image

యాసిడ్ దాడి బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేలా పునరావాస పథకం ఎందుకు తీసుకురాలేదని రాష్ట్రాలు, UTలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వారికి ప్రభుత్వ నియంత్రణలో ఉన్న రంగాల్లో ఉపాధి కల్పించే పథకాన్ని రూపొందించాలని ఆదేశించింది. ఉద్యోగాలు ఇవ్వడంలో ఏవైనా సమస్యలుంటే జీవన భత్యం చెల్లించేలా పాలసీ తీసుకురావాలని సూచించింది. హరియాణాకు చెందిన ఓ యాసిడ్ బాధితురాలి కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

News March 10, 2026

లా, బీఈడీ కోర్సుల ఫీజులు ఖరారు

image

TG: రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీల్లో లా, బీఈడీ కోర్సుల ఫీజులు ఖరారయ్యాయి. 3 ఏళ్ల LLB కోర్సుకు కనిష్ట ఫీజు ₹20వేలు, గరిష్టంగా ₹40,300, ఐదేళ్ల LLB కోర్సుకు ₹20 వేలు, ₹44,800గా ఫిక్స్ చేశారు. పీజీ లా కోర్సు ₹26,000, ₹50,400గా ఉంది. బీఈడీకి కనిష్టంగా ₹16,500, గరిష్ట ఫీజు ₹50,800, ఎంఈడీ కోర్సుకు ₹25వేలు, ₹45వేలుగా నిర్ణయించారు. 2027-28 అకడమిక్ ఇయర్ వరకు ఇవే ఫీజులు ఉండనున్నాయి.

News March 10, 2026

సమ్మర్‌లో కరెంట్ బిల్ తగ్గాలంటే!

image

✦ ఫిలమెంట్ బల్బులు, ట్యూబ్ లైట్ల బదులు LED బల్బులు వాడాలి
✦ AC టెంపరేచర్‌ను 24-26°C మధ్య సెట్ చేయాలి. ఒక్క డిగ్రీ పెంచితే సుమారు 6% కరెంటు ఆదా
✦ AC ఆన్‌లో ఉండగా తక్కువ స్పీడ్‌లో ఫ్యాన్ కూడా ఆన్‌లో ఉంచితే రూమ్ త్వరగా చల్లబడుతుంది
✦ AC ఎయిర్ ఫిల్టర్‌ను 15 రోజులకోసారి శుభ్రం చేయాలి
✦ TV, ల్యాప్‌టాప్ ఛార్జర్, మైక్రోవేవ్ వంటివి స్టాండ్‌బై మోడ్‌లోనూ విద్యుత్ వాడతాయి. వాటిని ఆఫ్ చేయాలి