News April 8, 2025

APSRTC 750 ఎలక్ట్రిక్ బస్సులు

image

APకి కేంద్రం శుభవార్త అందించింది. ‘PM ఈ-బస్ సేవా’ కింద తొలి దశలో 750 ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. విజయవాడ, GNT, VSKP, కాకినాడ, రాజమండ్రి, NLR, తిరుపతి, కర్నూలు, అనంతపురం, మంగళగిరి, కడప నగరాల్లో వీటిని తిప్పనుంది. PPP పద్ధతిలో 10వేల బస్సులను రాష్ట్రాలకు కేంద్రం ఇస్తుండగా, ఏపీకి 750 కేటాయించింది. త్వరలోనే ఏ డిపోకు ఎన్ని కేటాయించాలనే దానిపై వివరాలను అధికారులు వెల్లడించనున్నారు.

Similar News

News April 19, 2025

10,945 GPO పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్!

image

TG: 10,945 గ్రామ పాలన అధికారి(GPO) పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. తొలుత VRA, VROలలో అర్హులైన వారిని తీసుకోవాలని భావించింది. అయితే, కొత్త పోస్టులతో తమ పాత సర్వీస్ కోల్పోతామని కొందరు కోర్టుకెక్కారు. దీంతో పాటు సర్దుబాటు చేసిన వారిని తీసుకుంటే కొత్త సమస్య వస్తుందని ఆలోచించి.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌తో పాటు పలు సర్దుబాట్లపై సర్కారు కసరత్తు చేస్తోంది.

News April 19, 2025

ఆ లిస్టులో సెకండ్ ప్లేస్‌కు పాటీదార్

image

నిన్న పంజాబ్‌తో మ్యాచ్ సందర్భంగా RCB కెప్టెన్ రజత్ పాటీదార్ IPLలో తక్కువ ఇన్నింగ్స్‌(30)లో 1,000 పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో 2వ స్థానం దక్కించుకున్నారు. ఈ లిస్టులో 25 ఇన్నింగ్స్‌లతో GT ప్లేయర్ సాయి సుదర్శన్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు. సచిన్, రుతురాజ్ 3వ స్థానంలో ఉన్నారు. కాగా, ఈ ఏడాది RCBకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పాటీదార్ 7మ్యాచుల్లో 209 రన్స్ చేసి జట్టును ముందుండి నడిపిస్తున్నారు.

News April 19, 2025

ఈనెల 23 నుంచి JEE అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్

image

జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈనెల 23న ప్రారంభం కానుంది. మే 2 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తొలుత <<16144953>>మెయిన్‌లో<<>> సాధించిన మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు. ఆ తర్వాత ర్యాంకులు, రిజర్వేషన్ల ఆధారంగా మొత్తం 2.50 లక్షల మందికి అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ పరీక్ష మే 18న జరగనుంది. జూన్ 2న ఫలితాలు వెలువడుతాయి.

error: Content is protected !!