News April 8, 2025
NLG: పీఎం ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు గడువు పెంపు

ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 15 వరకు గడువు పొడిగించినట్లు నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.5 వేలు ఇస్తారని, 12 నెలల ఇంటర్న్ షిప్ సమయంలో 6 నెలల ఉద్యోగ శిక్షణ ఉంటుందన్నారు. pminternship.mca.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు టోల్ నంబర్ 1800 11 6090 ను సంప్రదించాలని సూచించారు.-SHARE IT..
Similar News
News April 19, 2025
వినుకొండ: రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన విద్యార్థి జీవితంలో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే వినుకొండ (M) పెదకంచర్లకు చెందిన దీప్తి అమెరికాలో MS చదువుతోంది. ఈ నెల 12న స్నేహితురాలితో కలిసి రోడ్డుపై వెళ్తుండగా కారు ఢీకొట్టింది. దీంతో తలకు తీవ్ర గాయమైంది. ఈ మేరకు ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇంకో నెల అయితే ఆమె కోర్సు పూర్తి అవుతుంది. అంతలోనే తీవ్ర విషాదం నెలకొంది.
News April 19, 2025
శ్రీనగర్ SSPగా కర్నూల్ వాసి.!

కర్నూలు జిల్లాకు చెందిన డాక్టర్ సందీప్ చక్రవర్తి జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ SSPగా నియమితులయ్యారు. శుక్రవారం జరిగిన IPS అధికారుల బదిలీల్లో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆయనను శ్రీనగర్ SSPగా నియమించింది. కర్నూలు జిల్లాకు చెందిన ఆయన కీలక పదవుల్లో చేయడంపై చిన్ననాటి సన్నిహితులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
News April 19, 2025
వరంగల్: ‘అత్తాన, పోతాన’.. ఇదే మన యాస, భాష

ప్రాంతాన్ని బట్టి భాష మాట్లాడే తీరు ఉంటుంది. WGL, KNR జిల్లాల్లో మాత్రం భాష కాస్త భిన్నంగా ఉంటుంది. KNRలో అకారంతో మాట్లాడితే WGLలో ఒకారంతో మాట్లాడతారు. KNRలో వడ్లు అంటే WGLలో ఒడ్లు అంటాం. వేరే జిల్లాల్లో వస్తున్నా, వెళ్తున్నా అంటే మనం మాత్రం ‘అత్తాన, పోతాన’ అంటుంటాం. అచ్చిన, అట్లనా, అవ్వ, నాయిన, అప్పయ్య, బాపు, జరఆగు, షానా(చాలా), పైలం, బువ్వ అనేపదాలు వాడుతుంటాం. మీరెలా మాట్లాడుతారో కామెంట్ చేయండి.