News April 8, 2025
ఈ నెల 10-14 వరకు కామారెడ్డిలో 163 సెక్షన్: SP

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 10-14 వరకు 163 (BNSS) సెక్షన్ అమలులో ఉంటుందని SP రాజేశ్ చంద్ర తెలిపారు. జిల్లాలో సమావేశాలు, ర్యాలీలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. చట్టవిరుద్ధమైన ఘటనలు జరగకుండా నిరోధించడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు.
Similar News
News November 8, 2025
సిరిసిల్ల: ‘నిబంధనలకు అనుగుణంగా సీఎంఆర్ సరఫరా చేయాలి’

రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రైస్ మిల్లర్లు సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్)ను సరఫరా చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గడ్డం నగేష్ ఆదేశించారు. సీఎంఆర్ సరఫరా, ఖరీఫ్ ధాన్యం కేటాయింపు, బ్యాంక్ గ్యారెంటీ వంటి అంశాలపై ఆయన శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో రా రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేటాయించిన ధాన్యం, ఎఫ్‌సీఐకి ఇచ్చిన బియ్యం వివరాలు సమర్పించాలని ఆయన ఆదేశించారు.
News November 7, 2025
ఈ పొజిషన్‌లో నిద్రపోతున్నారా?

నిద్రపోయే సమయంలో పడుకునే పొజిషన్ చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముడుచుకుని లేదా బోర్లా పడుకోవడం వల్ల వెన్నెముక సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. బోర్లా పడుకుంటే మెడ కండరాలపై, నడుముపై ఒత్తిడి పడుతుందని పేర్కొంటున్నారు. ఇక మోకాళ్లను ముడుచుకుని ఒక వైపుకు పడుకోవడం వల్ల దీర్ఘకాలిక వెన్ను నొప్పులు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. వెల్లకిలా లేదా ఎడమవైపుకు తిరిగి పడుకోవాలంటున్నారు.
News November 7, 2025
జనగామ: కార్మిక రాజ్యమే శ్రామికుల జీవితాల్లో మార్పు తెస్తుంది: రమ

కార్మిక రాజ్యమే శ్రామికుల జీవితాల్లో మార్పు తీసుకొస్తుందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్వీ రమ అన్నారు. జనగామలో శుక్రవారం జరిగిన సీఐటీయూ జిల్లా 4వ సభలో పాల్గొని వారు మాట్లాడారు. కార్మికులందరూ.. ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. దోపిడీ కార్పొరేట్ శక్తుల వల్ల కార్మికులు నష్టపోతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాపర్తి రాజు, బి.మధు, పి.శ్రీకాంత్, యాటల సోమన్న తదితరులు పాల్గొన్నారు.


