News April 8, 2025
సత్తెనపల్లిలో విద్యార్థిని ఆత్మహత్య

బీఎస్సీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. సత్తెనపల్లికి చెందిన మాజీ కౌన్సిలర్ సురేశ్ కుమార్ కుమార్తె సాహితీ సంధ్య (18) శ్రీకాకుళం జిల్లాలో అగ్రికల్చరల్ బీఎస్సీ చదువుతోంది. సెలవులకి ఇంటికి వచ్చింది. కళాశాలకు వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో సంధ్య చిన్నమ్మ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 19, 2025
10,945 GPO పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్!

TG: 10,945 గ్రామ పాలన అధికారి(GPO) పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. తొలుత VRA, VROలలో అర్హులైన వారిని తీసుకోవాలని భావించింది. అయితే, కొత్త పోస్టులతో తమ పాత సర్వీస్ కోల్పోతామని కొందరు కోర్టుకెక్కారు. దీంతో పాటు సర్దుబాటు చేసిన వారిని తీసుకుంటే కొత్త సమస్య వస్తుందని ఆలోచించి.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌తో పాటు పలు సర్దుబాట్లపై సర్కారు కసరత్తు చేస్తోంది.
News April 19, 2025
పినపాక: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం- సీతారాంపురం గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహన ఢీకొని సీతారాంపురంకి చెందిన కోడి రెక్కల నరసింహ(60) మృతి చెందాడు. శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం ఎలా జరిగిందో పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
News April 19, 2025
ఏలూరు: మెగా DSCలో మొత్తం పోస్టులు ఇవే..!

మరో కొద్ది రోజుల్లో మెగా DSC నోటిఫికేషన్ విడుదల కానుందని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఉమ్మడి ప.గో.జిల్లాలో భర్తీ అయ్యే పోస్టులను ఆయా యాజమాన్యాలు ప్రకటించాయి. ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలలో మొత్తం 725, మున్సిపల్ యాజమాన్య పాఠశాలకు సంబంధించి 310 పోస్టులు భర్తీ చేస్తారు. ఇటీవల జిల్లాకు మంజూరైన 166 స్పెషల్ పోస్టుల భర్తీని డీఎస్సీతో సంబంధం లేకుండా విడుదల చేస్తారు.