News April 8, 2025

అనకాపల్లి జిల్లాలో ‘గుండె’లు పిండేసిన ఘటన

image

బుచ్చయ్యపేట(M)బంగారుమెట్టులో విషాదం నెలకొంది. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు వేర్వేరు ప్రాంతాల్లో గుండెపోటుతో సోమవారం మరణించారు. మేరుగు శ్రీను(28) పెయింటింగ్ పనికి అరకు వెళ్లాడు. పని చేస్తుండగా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లేలోపే మరణించాడు. కార్పెంటర్‌గా పనిచేస్తున్న నక్కా లక్ష్మీనారాయణ(48) మధువాడ ఐటీ హిల్స్ వద్ద గుండెపోటుతో రోడ్డుపైనే కుప్పకూలి మరణించాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

Similar News

News January 14, 2026

బాపట్లలో రాష్ట్రస్థాయి ఎడ్ల ప్రదర్శన

image

సంక్రాంతి సందర్భంగా బాపట్లలో 16వ రాష్ట్రస్థాయి ఎడ్ల ప్రదర్శన బుధవారం ప్రారంభమైంది. బీమావారిపాలెం రామాలయం కమిటీ ఆధ్వర్యంలో మున్నంవారిపాలెం రోడ్డులో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్, డీఎస్పీ రామాంజనేయులు పోటీలను ప్రారంభించారు. పండగ పూట నిర్వహించిన ఈ ప్రదర్శనను తిలకించేందుకు జనం ఆసక్తి చూపారు.

News January 14, 2026

ఫేక్ రిఫండ్లతో ₹5 కోట్లు కొల్లగొట్టాడు

image

e-కామర్స్ ప్లాట్‌ఫాంల రిటర్న్ సిస్టమ్ లూప్‌హోల్స్‌ను ఆసరా చేసుకొని ఓ యువకుడు రిఫండ్ కింద ఏకంగా ₹5Cr కొల్లగొట్టాడు. చైనాలో లూ అనే వ్యక్తి కాస్మొటిక్ షాపింగ్ ప్లాట్‌ఫాంలో 11900 ఫేక్ రిఫండ్ రిక్వెస్టులు పెట్టాడు. తనకు వచ్చిన వస్తువుల్ని తిరిగి సెకండ్స్ కింద మార్కెట్లో అమ్మేవాడు. 2024లో రిఫండ్‌లపై అనుమానంతో ఓ కంపెనీ ఫిర్యాదు చేయగా స్కామ్ బయటపడింది. చివరకు కోర్టు అతనికి 6ఏళ్ల జైలుశిక్ష విధించింది.

News January 14, 2026

జగిత్యాల: కేంద్రానికి స్పీడ్ పోస్టుల వినతులు

image

పెన్షనర్లకు ఆదాయపు పన్ను రద్దు చేయాలని రాష్ట్ర కార్యదర్శి, జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశం ఆయన మాట్లాడుతూ.. 2026-27 కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో తమ గోడును వినిపించేందుకు ‘స్పీడ్ పోస్టు’ ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రికి వినతిపత్రాలు పంపినట్లు పేర్కొన్నారు.