News April 8, 2025
మహబూబ్‌నగర్‌లో CONGRESS VS BRS

పాలమూరు పరిధి GDWL, NGKL, NRPT, WNP, MBNR జిల్లాల్లో BRS, కాంగ్రెస్ మధ్య రాజకీయం నువ్వానేనా అన్నట్లుగా సాగుతోంది. ఓ వైపు BRSనేతలు KCR వరంగల్ సభపై సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు జైబాపు.. జైభీమ్.. జైసంవిధాన్ పేరిట పాదయాత్రలు, ర్యాలీలు, సన్నబియ్యం పంపిణీతో ప్రజల్లో ఉంటూ BRSనేతలకు కౌంటర్ ఇస్తున్నారు. మీ కామెంట్?
Similar News
News December 29, 2025
FLASH: పాలమూరులో మరోసారి ఎన్నికలు

మహబూబ్ నగర్ జిల్లాలో మరోసారి ఎన్నిక సందడి నెలకొననుంది. జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లో
కౌన్సిలర్లు పోలింగ్‌కు అధికారులు సిద్ధం అవ్వాలని ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం..
✒మహబూబ్ నగర్- 60 వార్డుల్లో 2,20,334 మంది జనాభా
✒దేవరకద్ర-12, వార్డుల్లో 12,269 మంది
✒భూత్పూర్-10 వార్డుల్లో 13,938 మంది
ఓటర్ల జాబితా అధికారులు సిద్ధం చేయనున్నారు.
News December 29, 2025
MBNR:T-20 టోర్నీ.. మన టీం షెడ్డుల్ ఇదే!

HCA ఆధ్వర్యంలో నిర్వహించిన జి.వెంకటస్వామి మెమోరియల్ “టీ-20 క్రికెట్ లీగ్” లో ఉమ్మడి మహబూబ్ నగర్ క్రికెట్ జట్టు పాల్గొంటుందని ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు.
✒ఈనెల 29న MBNR- కరీంనగర్
✒ఈ నెల 31న MBNR-HYD
✒Jan 3న MBNR- ఖమ్మం
✒Jan 5న MBNR-RR
✒Jan 6న MBNR- వరంగల్
✒Jan 8న MBNR- అదిలాబాద్
✒Jan 9న MBNR- నల్గొండ
✒Jan 13న MBNR- నిజామాబాద్
✒Jan 15న MBNR- మెదక్
News December 29, 2025
MBNR: ఆపరేషన్ స్మైల్-XII.. సమన్వయ సమావేశం

మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా ఎస్పీ డి జానకి ఆదేశాల మేరకు సోమవారం అదనపు ఎస్పీ ఎన్.బి.రత్నం అధ్యక్షతన ‘ఆపరేషన్ స్మైల్-XII’ నిర్వహణకు సంబంధించి సమన్వయ సమావేశం నిర్వహించారు. అదనపు ఎస్పీ ఎన్.బి. రత్నం మాట్లాడుతూ.. 2026 జనవరి 1 నుంచి జనవరి 31 వరకు జిల్లావ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.


