News April 8, 2025

NLG: వైద్య ఆరోగ్యశాఖలో అద్దె వాహనాలకు ఆహ్వానం

image

వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యం లో జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్‌కు జిల్లాలోని అన్ని పీహెచ్సీలు, యూపీహెచ్సీల నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించేందుకు ట్యాక్స్ ప్లేట్ కలిగిన అద్దె వాహనాలకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ తెలిపారు. పూర్తి వివరాలకు https://nalgonda.telangana. gov.in వెబ్సైట్స్ ను పరిశీలించాలని సూచించారు.

Similar News

News November 7, 2025

బాలల హక్కులు, విద్యపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

image

నల్గొండ జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ, విద్యపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.
గురువారం రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు హరిత, చందనలతో ఆమె సమావేశమయ్యారు. విద్యా సంస్థల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించడంతో విద్యా వ్యవస్థ బలోపేతమైందని కలెక్టర్ వెల్లడించారు. బాల్య వివాహాలు, శిశు విక్రయాల నిర్మూలనకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె వివరించారు.

News November 6, 2025

నల్గొండ: సోదరిని చూసేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి

image

గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడని చిట్యాల ఎస్ఐ రవికుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా.. SRPT జిల్లా కేసారానికి చెందిన సువర్ణ రాజు (19), గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన సోదరిని చూడడానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. చిట్యాల దాటాక అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనగా బలమైన గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై తండ్రి లింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News November 6, 2025

నల్గొండ: దూడకు రెండే కాళ్లు..!

image

తిప్పర్తి మండలం పజ్జూరులో రైతు జంజీరాల గోపాల్‌కు చెందిన గేదె రెండు కాళ్ల దూడకు జన్మనిచ్చింది. దూడకు కేవలం ముందు కాళ్లు మాత్రమే ఉన్నాయని, వెనుక కాళ్లు లేవని రైతు తెలిపారు. దూడ ఆరోగ్యంగానే ఉందని ఆయన చెప్పారు. ఈ దూడను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తరలివస్తున్నారు.