News April 8, 2025
భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలి: భద్రకాళి ఆలయ ఈవో

ఓరుగల్లు ఇలవేల్పు, తెలంగాణ ఇంద్రకీలాద్రి శ్రీ భద్రకాళి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని ఆలయ కార్య నిర్వహణాధికారి (EO) శేషు భారతి కోరారు. మహిళలు ముఖ్యంగా గాజులు, బొట్టు ధరించాలని, జుట్టు విరబోసుకొని రావొద్దన్నారు. నిబంధనలు పాటించకుంటే ఆలయంలోకి అనుమతించబోమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆలయంలో ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
Similar News
News April 19, 2025
శ్రీనగర్ SSPగా కర్నూల్ వాసి.!

కర్నూలు జిల్లాకు చెందిన డాక్టర్ సందీప్ చక్రవర్తి జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ SSPగా నియమితులయ్యారు. శుక్రవారం జరిగిన IPS అధికారుల బదిలీల్లో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆయనను శ్రీనగర్ SSPగా నియమించింది. కర్నూలు జిల్లాకు చెందిన ఆయన కీలక పదవుల్లో చేయడంపై చిన్ననాటి సన్నిహితులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
News April 19, 2025
వరంగల్: ‘అత్తాన, పోతాన’.. ఇదే మన యాస, భాష

ప్రాంతాన్ని బట్టి భాష మాట్లాడే తీరు ఉంటుంది. WGL, KNR జిల్లాల్లో మాత్రం భాష కాస్త భిన్నంగా ఉంటుంది. KNRలో అకారంతో మాట్లాడితే WGLలో ఒకారంతో మాట్లాడతారు. KNRలో వడ్లు అంటే WGLలో ఒడ్లు అంటాం. వేరే జిల్లాల్లో వస్తున్నా, వెళ్తున్నా అంటే మనం మాత్రం ‘అత్తాన, పోతాన’ అంటుంటాం. అచ్చిన, అట్లనా, అవ్వ, నాయిన, అప్పయ్య, బాపు, జరఆగు, షానా(చాలా), పైలం, బువ్వ అనేపదాలు వాడుతుంటాం. మీరెలా మాట్లాడుతారో కామెంట్ చేయండి.