News April 8, 2025
HYDలో పొల్యూషన్.. అదే మన టార్గెట్!

HYD గాలిలో ధూళికణాల స్థాయి తగ్గింపే తమ లక్ష్యమని GHMC కమిషనర్ ఇలంబర్తి అన్నారు. పీఎం-10 స్థాయిని ఘనపు మీటరు గాలిలో 110 మైక్రోగ్రాముల నుంచి 81కి తగ్గించామని, అయితే దీన్ని 60 కంటే తక్కువకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. అప్పుడే ప్రజలకు నాణ్యమైన గాలి అందుతుందన్నారు. ఇందులో ప్రతీ పౌరుడు భాగస్వామ్యులవ్వాలని పిలుపునిచ్చారు.
Similar News
News July 6, 2025
రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: ములుగు కలెక్టర్

ములుగు కలెక్టరేట్‌లో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. సోమవారం జిల్లాలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క పర్యటన నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు. వచ్చే సోమవారం యధావిధిగా ప్రజావాణి కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
News July 6, 2025
అనకాపల్లి: ‘ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు చేయ్యోచ్చు’

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి రాలేని వారు ఆన్‌లైన్‌లో ఫిర్యాదులను నమోదు చేయవచ్చని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదివారం పేర్కొన్నారు. సమస్యలపై meekosam.ap.gov.in వెబ్ సైట్‌లో ఫిర్యాదు చేయడానికి అవకాశం కల్పించామన్నారు. వారి సమస్యల పరిష్కార స్థితిని 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని సూచించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు.
News July 6, 2025
F-35B గురించి తెలుసా?

Lockheed Martin అనే US కంపెనీ తయారు చేసిన అత్యాధునిక ఐదో తరం <<16919199>>F-35B<<>> యుద్ధవిమానాన్ని UK కొనుగోలు చేసింది. ఇది గంటకు 1,975KM వేగంతో ప్రయాణించగలదు. టేకాఫ్ అయ్యేందుకు 500 ఫీట్ల రన్ వే సరిపోతుంది. కార్బన్ ఫైబర్, టైటానియం, అల్యూమినియం మెటల్స్ వాడటం వల్ల రాడార్లు దీన్ని గుర్తించలేవు. ఫలితంగా శత్రు దేశానికి తెలియకుండా దాడులు చేయవచ్చు. ఇది జూన్ 14న తిరువనంతపురం (కేరళ)లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది.