News April 8, 2025

సలేశ్వరం జాతర ఏర్పాట్లపై సమీక్షించిన జిల్లా కలెక్టర్

image

లింగాల మండలంలో ప్రతి సంవత్సరం పౌర్ణమికి జరిగే సలేశ్వరం జాతరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ మంగళవారం ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ఆయన సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈనెల 11, 12, 13 తేదీల్లో జాతర జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రసిద్ధ జాతరకు పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ, రెవెన్యు అధికారులు పాల్గొన్నారు.

Similar News

News April 19, 2025

శ్రీ భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

image

ఓరుగల్లు ఇలవేల్పు, తెలంగాణ ఇంద్రకీలాద్రి భద్రకాళి దేవస్థానంలో చైత్ర మాసం షష్టి తిధి శనివారం సందర్భంగా ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, భక్తులు తదితరులున్నారు.

News April 19, 2025

ముధోల్: వడదెబ్బతో వివాహిత మృతి

image

నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని మహాలక్ష్మిగల్లికి చెందిన ఠాగూర్ పూజా(36) అనే వివాహిత వడదెబ్బతో శుక్రవారం మృతి చెందింది. మూడు రోజులుగా పూజ ఎండలో వ్యవసాయ పనులు చేయడంతో తీవ్ర అస్వస్థకు గురైందని కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం వాంతులు కావటంతో స్థానికంగా ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అక్కడి వైద్యుల సూచన మేరకు నిజామాబాద్‌కి తీసుకెళ్లగా ఆసుపత్రిలో మృతి చెందిందని తెలిపారు.

News April 19, 2025

సమ్మర్‌లో ఎలాంటి దుస్తులు వేసుకోవాలంటే?

image

వేసవికాలంలో ఎండల దెబ్బకు శరీరం చెమటతో తడిసిముద్దవుతుంది. దీని నుంచి రిలీఫ్ కావాలంటే కొన్ని రకాల దుస్తులు ధరించాలని నిపుణులు చెబుతున్నారు. బయటకు వెళ్లినప్పుడు కాటన్‌తో కూడిన లూజ్ బట్టలు ధరించాలి. వీటి వల్ల చెమట ఈజీగా బయటకు వస్తుంది. ఇంట్లో ఉంటే షార్ట్స్, స్లీవ్ లెస్ టీషర్ట్స్ ధరించవచ్చు. లేత రంగుల దుస్తులు ధరించాలి. బ్లాక్, బ్లూ, రెడ్ వంటి రంగుల దుస్తులు వేసుకుంటే వేడిని గ్రహించి అలసిపోతారు.

error: Content is protected !!