News April 8, 2025

NZB: అనుముల ఇంటెలిజెన్స్‌తో రాష్ట్రానికి ప్రమాదం: కవిత

image

అనుముల ఇంటెలిజెన్స్‌తో రాష్ట్రానికి ప్రమాదం ఉందని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో చాలా ప్రమాదముందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు.. అనుముల ఇంటెలిజెన్స్ అని ఎద్దేవా చేశారు. అనుముల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్పా రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనిపించడం లేదన్నారు.

Similar News

News July 8, 2025

రైల్‌రోకో కేవలం ట్రైలరే: MLC కవిత

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోతే ఒక్క రైలు చక్రాన్ని కూడా ముందుకు కదలనివ్వబోమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, MLC కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. రైల్ రోకో కేవలం ట్రైలర్ మాత్రమేనని, బిల్లును ఆమోదించకపోతే భవిష్యత్తులో నిరవధికంగా రైల్‌రోకోను నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు.

News July 8, 2025

బోధన్: పథకాల అమలుపై కలెక్టర్ సమీక్ష

image

ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మంగళవారం ఆయన బోధన్ మున్సిపాలిటీలో పర్యటించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, వన మహోత్సవం, సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం చేపడుతున్న ముందస్తు చర్యలు, ప్లాట్ల క్రమబద్దీకరణ దరఖాస్తుదారులకు అనుమతుల మంజూరు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

News July 8, 2025

NZB ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా కృష్ణ మోహన్

image

నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్‌గా డాక్టర్ కృష్ణ మోహన్‌ను నియమిస్తూ వైద్య ఆరోగ్య, ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ప్రస్తుతం మహేశ్వరం మెడికల్ కళాశాలలో జనరల్ సర్జన్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం మెడికల్ కళాశాల ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్‌గా డాక్టర్ శివ ప్రసాద్ కొనసాగుతున్నారు.