News March 27, 2024
అనకాపల్లి: ‘వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలి’

అనకాపల్లి జిల్లాలో వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రవి సుభాష్ ఆదేశించారు మంగళవారం కలెక్టరేట్‌లో ఆర్డబ్ల్యూఎస్ గ్రామపంచాయతీ పురపాలక అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూగర్భ జలాల నీటిమట్టాలను అంచనా వేస్తూ అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయాలన్నారు. మరమ్మతులకు గురైన బోరుబావులను యుద్దప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలన్నారు.
Similar News
News April 2, 2026
జీవీఎంసీ వార్డుల విభజన ప్రారంభం

విశాఖలో జీవీఎంసీ ఎన్నికల దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. 98 వార్డులను 120కి పెంచుతూ, 2011 జనాభా లెక్కల ఆధారంగా విభజన ప్రక్రియ మొదలైంది. ఈనెల 9లోగా ప్రక్రియ పూర్తి చేసి, మే 5లోగా గెజిట్ విడుదల చేయనున్నారు. ఒక్కో వార్డుకు సగటున 15,840 జనాభా ఉండగా, 10% వరకు అటూ ఇటూగా మార్పులకు అవకాశం ఉంది. ప్రజల అభ్యంతరాల తర్వాత ఫైనల్ డ్రాఫ్ట్ ఆమోదం పొందనుంది. ఎన్నికలు ఆరు నెలల్లో జరిగే అవకాశం ఉంది.
News April 2, 2026
మధురవాడలో వ్యక్తి అనుమానాస్పద మృతి

పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధి శివశక్తి నగర్‌లో నాగదేవత గుడి సమీపంలో బుధవారం ఒక వ్యక్తి మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు అప్పుఘర్ సెక్టార్-9కు చెందిన బిలసోంతి ఉమాశంకర్ (51)గా పోలీసులు గుర్తించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పూర్తి వివరాలు వెలుగులోకి రానున్నాయి.
News April 2, 2026
నాణ్యమైన ఆహారం అందించండి: GVMC

విశాఖ వాసులకు హోటల్స్ విక్రయదారులు నాణ్యమైన ఆహారం అందించాలని GVMC కమిషనర్ కేతన్ గార్గ్ సూచించారు. బుధవారం GVMC కార్యాలయంలో నగర వీధి విక్రయదారులతోనూ, హోటల్స్ యజమానులతోనూ ఈట్ రైట్ పేరిట నాణ్యమైన ఆహారం ప్రజలకు అందించాలనే అంశంపై అవగాహన కల్పించారు. ఫుడ్ కంట్రోలర్ కళ్యాణ్ చక్రవర్తి, ఇతర అధికారుల సమక్షంలో పలు విషయాలపై సూచనలు ఇచ్చారు. కల్తీ విక్రయాలు, నాణ్యతలేని ఆయిల్, ఫుడ్ కలర్ వినియోగించవద్దన్నారు.


