News April 8, 2025
SKLM: రిజర్వేషన్ వర్గీకరణను తక్షణమే నిలుపుదల చేయాలి

పార్లమెంట్‌లో రిజర్వేషన్ వర్గీకరణపై చర్చ జరిగే వరకు వర్గీకరణను రాష్ట్రపతి నిలుపుదల చేయాలని ఎస్సీ నాయకులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని ఆదివారం పేట జంక్షన్ నుంచి అంబేడ్కర్ జంక్షన్ వరకు దళిత సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. హేతుబద్దత లేని అశాస్త్రీయమైన వర్గీకరణను తక్షణమే నిలుపుదల చేయాలని వారంతా డిమాండ్ చేశారు.
Similar News
News April 19, 2025
శ్రీకాకుళం: చికిత్స పొందుతూ మహిళ మృతి

శ్రీకాకుళం రూరల్ మండలం కరజాడ గ్రామంలో జరిగిన వంటగ్యాస్ ప్రమాదంలో మహిళ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. గ్రామానికి చెందిన జామి జయలక్ష్మి మార్చి 19వ తేదీన రాత్రి గ్యాస్ పేలి తీవ్ర గాయాలపాలైంది. వెంటనే కుటుంబ సభ్యులు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో విశాఖలోని కేజీహెచ్ తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశామన్నారు.
News April 19, 2025
టెక్కలి జిల్లా ఆసుపత్రి సేవలపై పబ్లిక్ కామెంట్స్

➤ <<16135497>>టెక్కలి జిల్లా ఆసుపత్రికి<<>> వచ్చే కేసులను ఎక్కువగా శ్రీకాకుళం రిఫర్ చేయడం➤ఇక్కడ పనిచేస్తున్న కొందరు వైద్యులు ప్రైవేట్ క్లినిక్స్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వడం.➤ఆసుపత్రిలో అందరికీ ఫ్యాన్లు,తాగునీరు లేకపోవడం,బెడ్ షీట్లు వేయకపోవడం ➤అత్యవసర ప్రసూతి కేసులపై పర్యవేక్షణ లోపం.➤వేధిస్తున్న అధునాతన వైద్య పరికరాల కొరత ➤ఆసుపత్రిలో రోగులపై కొందరు నర్సులు,సిబ్బంది దురుసు ప్రవర్తన.➤కొన్ని ముఖ్యమైన మందులు కొరత.
News April 19, 2025
నరసన్నపేట: వీడిన మిస్టరీ.. గుండెపోటుతో ఉద్యోగి మృతి

నరసన్నపేట మండల కేంద్రంలో స్థానిక మారుతీనగర్ ఒకటో వీధిలో అనుమానస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. వంశధార సబ్ డివిజన్‌లో అటెండర్‌గా పనిచేస్తున్న కొర్రాయి వెంకటరమణ గత మూడు రోజుల కిందట ఇంటి వద్ద ఉన్న సమయంలో గుండెపోటు రావడంతోనే మృతి చెందినట్లు ఎస్సై సీహెచ్ దుర్గాప్రసాద్ ధ్రువీకరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించామని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేశామని తెలిపారు.