News March 27, 2024
కృష్ణా జిల్లా వాసులకు పోలీసుల ముఖ్య విజ్ఞప్తి

డబ్బు సంపాదన కోసం క్రికెట్ బెట్టింగ్ మాయలో పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సూచించారు. ఈ మేరకు ఆయన మచిలీపట్నంలోని తన కార్యాలయం నుంచి మంగళవారం తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఐపీఎల్ సీజన్ జరుగుతున్నందున అప్పులు చేసి క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడి కుటుంబాలను అంధకారంలో పడవేయవద్దని అద్నాన్ నయీం అస్మి కోరారు.
Similar News
News March 11, 2026
గ్యాస్ సిలిండర్లపై అసత్య ప్రచారం చేస్తే చర్యలు: SP

ప్రస్తుతం నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల కొరత, ధరలపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా SP విద్యాసాగర్ హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధిక ధరలకు బ్లాక్ మార్కెట్‌లో సిలిండర్లు విక్రయించినా, కృత్రిమ కొరత సృష్టించాలని చూసినా చర్యలు తప్పవన్నారు. అధిక ధరలకు విక్రయిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
News March 11, 2026
మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి మృతి

కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు బుధవారం హైదరాబాదులో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన ఆయన 1984,1989,1998లో మచిలీపట్నం నుంచి, 2004, 2009లో ఏలూరు నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2013లో కేంద్ర జౌళి శాఖ మంత్రిగా సేవలందించారు. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కావూరి మరణంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
News March 10, 2026
కృష్ణా: ‘పుర’లో ప్రత్యేక పాలన

స్థానిక సంస్థలైన నగర పాలక సంస్థ, పురపాలక సంఘం, నగర పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 17తో ముగియనుంది. దీంతో ప్రత్యేక అధికారుల పాలనకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్నికలు జరిగే వరకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 18 నుంచి ప్రత్యేక అధికారులు అధికారం చేపట్టనున్నారు. మచిలీపట్నం కార్పొరేషన్‌కు కలెక్టర్, పెడన మున్సిపాల్టీకి RDO, పెడనకు MUDA VC ప్రత్యేక అధికారులుగా వ్యవహరించనున్నారు.


