News April 8, 2025

అలంపూర్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

image

అలంపూర్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం మంగళవారం లభ్యమైంది. స్థానికుల కథనం మేరకు.. అలంపూర్ మున్సిపాలిటీ సమీపంలో ఉన్న తుంగభద్ర నది వంతెన కింద గుర్తుతెలియని వ్యక్తి మృతి దేహం పడి ఉంది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడికి సంబంధించిన వివరాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నారు.

Similar News

News January 13, 2026

JN: రూ.100 కోట్లకు పైగానే అక్రమాలు!

image

భూభారతిలో అక్రమార్కులు ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.100 కోట్లు గండి కొట్టినట్లు తెలుస్తోంది. 2020 Nov 2 నుంచి 31 DEC 2025 వరకు (భూభారతి + ధరణి ) 52,13,729 ట్రాన్సాక్షన్లు జరిగాయి. 41,38,641 సేల్ డీడ్ ట్రాన్సాక్షన్లతో ప్రభుత్వానికి రూ.13,473 కోట్ల ఆదాయం వచ్చింది. సుమారు 5,200 స్లాట్ బుకింగ్‌లలో అక్రమాలు జరిగినట్లు సమాచారం. NLG, MDK, RR జిల్లాల్లోనే అత్యధిక ఫ్రాడ్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

News January 13, 2026

జూదాలకు పాల్పడితే కఠిన చర్యలు: SP

image

సంక్రాంతి పండుగ సందర్భంగా అన్నమయ్య జిల్లాలో జుదాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి హెచ్చరించారు. మంగళవారం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. కోడిపందేలు, పేకాట, గుండాట, జూదక్రీడలు నిర్వహిస్తే కఠినశిక్షలు తప్పవన్నారు. పందేలకోసం స్థలాలు ఇచ్చిన యజమానులను కూడా నిందితులుగా పరిగణించి కేసు నమోదు చేస్తామన్నారు. పోలీసు కేసుల్లో ఇరుక్కుంటే ఉద్యోగాలు, పాస్‌పోర్ట్ రావడం కష్టమన్నారు.

News January 13, 2026

కోలీవుడ్‌లో కొత్త వివాదం.. పరాశక్తి బ్యాన్‌కు కాంగ్రెస్ డిమాండ్

image

కోలీవుడ్‌లో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. శివకార్తికేయన్ హీరోగా నటించిన పరాశక్తి సినిమాను బ్యాన్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం ఆధారంగా తెరకెక్కించిన ఈ మూవీలో తమ పార్టీని, నేతల్ని కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే ఆయా సీన్‌లను తొలగించాలని డిమాండ్ చేసింది. సుధా కొంగర డైరెక్ట్ చేసిన ఈ చిత్రం జనవరి 10న రిలీజైంది.