News April 8, 2025
బాన్సువాడ: గుండెపోటుతో హోంగార్డు మృతి

బాన్సువాడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న సాయిలు(55) గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన సోమవారం విధులు నిర్వహించి స్వగ్రామమైన దేశాయిపేట్‌లోని ఇంటికి వెళ్లారు. తరువాత ఛాతి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హోంగార్డు సాయిలు మృతి చెందాడని గ్రామస్థులు తెలిపారు.
Similar News
News April 19, 2025
ముధోల్: వడదెబ్బతో వివాహిత మృతి

నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని మహాలక్ష్మిగల్లికి చెందిన ఠాగూర్ పూజా(36) అనే వివాహిత వడదెబ్బతో శుక్రవారం మృతి చెందింది. మూడు రోజులుగా పూజ ఎండలో వ్యవసాయ పనులు చేయడంతో తీవ్ర అస్వస్థకు గురైందని కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం వాంతులు కావటంతో స్థానికంగా ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అక్కడి వైద్యుల సూచన మేరకు నిజామాబాద్‌కి తీసుకెళ్లగా ఆసుపత్రిలో మృతి చెందిందని తెలిపారు.
News April 19, 2025
సమ్మర్‌లో ఎలాంటి దుస్తులు వేసుకోవాలంటే?

వేసవికాలంలో ఎండల దెబ్బకు శరీరం చెమటతో తడిసిముద్దవుతుంది. దీని నుంచి రిలీఫ్ కావాలంటే కొన్ని రకాల దుస్తులు ధరించాలని నిపుణులు చెబుతున్నారు. బయటకు వెళ్లినప్పుడు కాటన్‌తో కూడిన లూజ్ బట్టలు ధరించాలి. వీటి వల్ల చెమట ఈజీగా బయటకు వస్తుంది. ఇంట్లో ఉంటే షార్ట్స్, స్లీవ్ లెస్ టీషర్ట్స్ ధరించవచ్చు. లేత రంగుల దుస్తులు ధరించాలి. బ్లాక్, బ్లూ, రెడ్ వంటి రంగుల దుస్తులు వేసుకుంటే వేడిని గ్రహించి అలసిపోతారు.
News April 19, 2025
నంద్యాల వస్తుండగా ప్రమాదం.. భార్యాభర్తలు మృతి

గద్వాల జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ధర్మారెడ్డి కుటుంబ సభ్యులంతా కలిసి నంద్యాలకు కారులో వెళ్తున్నారు. గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని ప్రియదర్శి హోటల్ ముందు జాతీయ రహదారిపై శనివారం తెళ్లవారుజామున వారి కారు అదుపుతప్పి బోల్తా పడింది. కారులో మొత్తం ఆరుగురు ఉండగా అందులో పుల్లారెడ్డి, లక్ష్మీసుబ్బమ్మ భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు.