News April 8, 2025
NZB: నిర్మాణాలు చేపట్టేలా లబ్దిదారులను ప్రోత్సహించాలి: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరతగతిన నిర్మాణాలు చేపట్టేలా వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ఇళ్ల మంజూరైన వారందరు వెంటనే నిర్మాణాలు ప్రారంభించేలా తగిన తోడ్పాటును అందించాలన్నారు. ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన వారు నిర్దేశిత గడువు లోగా, నిబంధనలకు అనుగుణంగా నాణ్యతతో నిర్మాణ పనులు పూర్తి చేసుకునేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు.
Similar News
News January 27, 2026
NZB: 20 కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణ: కమిషనర్

నిజామాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి 60 డివిజన్లో అభ్యర్థుల నామినేషన్ స్వీకారం కోసం 20 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. మూడు డివిజన్లకు కలిపి ఒక కేంద్రం చొప్పున నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోటీ చేసే అభ్యర్థులు తమ కేంద్రాలను గుర్తించాలని సూచించారు.
News January 27, 2026
NZB: ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని విధాలుగా సిద్ధం: కలెక్టర్

ఎన్నికల సంఘం నియమ, నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల కమిషనర్ దృష్టికి తెచ్చారు. ఎన్నికల షెడ్యూల్ ను అనుసరిస్తూ బుధవారం నుండి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు వీలుగా ఆయా మున్సిపాలిటీల పరిధిలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
News January 27, 2026
నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి బదిలీ

నిజామాబాద్ నగర ఏసీపీ ఎల్. రాజా వెంకటరెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సైబరాబాద్ ఎస్బీ ఏసీపీగా పనిచేస్తున్న బి. ప్రకాష్‌ను నియమిస్తూ డీజీపీ శశిధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 2024 ఫిబ్రవరిలో బాధ్యతలు చేపట్టిన రాజా వెంకటరెడ్డి బదిలీ కావడం నగరంలో చర్చనీయాంశమైంది. బదిలీ అయిన ఆయనను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని అధికారులు ఆదేశించారు.


