News April 8, 2025

ఏసీబీ వలలో చింతలపాలెం ఎస్సై అంతిరెడ్డి

image

చింతలపాలెం ఎస్సై అంతిరెడ్డి ఏసీబీ వలలో చిక్కాడు. ఓ వ్యక్తి నుంచి రూ.10 వేల లంచం తీసుకుంటుండగా మంగళవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఎస్సై ఏసీబీకి చిక్కడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎస్సై అంతిరెడ్డి నార్కెట్‌పల్లిలో పనిచేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News July 7, 2025

నల్గొండలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి..!

image

నల్గొండలో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు వన్ టౌన్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఓ యువకుడు, ఇద్దరు మహిళలని అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా కలెక్టర్ ఆఫీస్ వెనకాల ఓ ఇంటిని కిరాయికి తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా నడిపిస్తున్న వ్యవహారంపై నిఘా పెట్టారు. నమ్మదగిన సమాచారం మేరకు ఈ రోజు మెరుపు దాడులు చేసి పట్టుకున్నట్లు సమాచారం.

News July 7, 2025

NLG: సగం అంగన్వాడీ కేంద్రాలకే సొంత భవనాలు!

image

జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు అరకొర సౌకర్యాలతోనే నడుస్తున్నాయి. సగం కేంద్రాలకు సొంత భవనాలు లేవు. కొన్ని చోట్ల మంజూరైనా నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. చిన్నారులకు పౌష్టికాహారం, గర్భిణీలు, బాలింతలకు ఆరోగ్య సేవలు అందించే ఈ కేంద్రాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఇక అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక కొందరు తల్లిదండ్రులు తమ చిన్నారులను ఆయా కేంద్రాలకు పంపించడం లేదు.

News July 7, 2025

నల్గొండ జిల్లాలో 5వేలకు పైగానే రేషన్ కార్డులు కట్!

image

జిల్లాలో రేషన్ కార్డుల్లో అనర్హుల ఏరివేతకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వరుసగా ఆరు నెలలపాటు బియ్యం తీసుకొని కార్డులు రద్దు కానున్నట్లు సమాచారం. జిల్లాలో ప్రస్తుతం 4,78,216 రేషన్ కార్డులు ఉన్నాయి. కాగా జిల్లాలో 5,092 కార్డుదారులు ఆరు మాసాల నుంచి బియ్యం తీసుకోవడం లేదని తేల్చి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో వారిని అనర్హులుగా ప్రకటించి కార్డులు తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.