News April 8, 2025
అనకాపల్లి: ఈ ఏడాది 132 మంది అరెస్ట్

గంజాయి కేసుల్లో ఈ ఏడాది ఇప్పటివరకు 132 మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తుహిన్ సిన్హా మంగళవారం తెలిపారు. కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. 42 కేసులు నమోదు కాగా 178 మందిని గుర్తించామని కలెక్టర్‌కు వివరించారు. 3,090 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, 53 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఇద్దరిపై పీడీ యాక్ట్ నమోదు ప్రక్రియ ప్రారంభించినట్లు చెప్పారు.
Similar News
News July 5, 2025
నిర్మల్: మంత్రి ఆదేశాల అమలుపై అధికారులతో సమీక్ష

మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథ పనుల పురోగతిపై ప్రతివారం నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో శానిటేషన్ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని, మొక్కల సంరక్షణకు గ్రామస్థాయిలో బాధ్యతలు అప్పగించాలన్నారు. పరిశుభ్రత, మంచి నీటి వినియోగం, పచ్చదనం పెంపుతో ప్రజలు ఆరోగ్యంగా ఉండగలరని పేర్కొన్నారు.
News July 5, 2025
విజయనగరం: మా భవాని ‘బంగారం’

విజయనగరం జిల్లా కొండకరకాం గ్రామానికి చెందిన రెడ్డి భవాని వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తాచాటింది. కజికిస్తాన్‌లో జరుగుతున్న
ఏసియన్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో శనివారం పాల్గొని మూడు బంగారు పతకాలు సాధించింది. వెయిట్ లిఫ్టింగ్‌లో భవాని అద్భుత ప్రతిభ కనబర్చడంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు, జిల్లా క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
News July 5, 2025
సింగరేణి 136 ఏళ్ల చరిత్రలో తొలిసారి..

TG: 136 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థలో కొత్త అధ్యాయం మొదలైంది. తొలిసారిగా ఇందులో మహిళా రెస్క్యూ టీమ్ ఏర్పాటైంది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎక్స్(X) వేదికగా వెల్లడించారు. విపత్తు సమయంలో ధైర్యంగా, నైపుణ్యంతో సహాయక చర్యలు చేపట్టేందుకు ఈ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ బృందానికి అభినందనలు తెలిపారు.