News April 8, 2025

IPL: ఓడిపోయినా మనసులు గెలుచుకున్నాడు

image

లక్నోతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులో కేకేఆర్ పోరాడి ఓడింది. 239 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఆ జట్టు బ్యాటర్లు ఆఖరి వరకు పోరాటం చేశారు. చివరి ఓవర్లో 24 రన్స్ చేయాల్సి ఉండగా రింకూ సింగ్ 14 రన్స్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరి ఓవర్ మొదట్లోనే స్టైక్ వస్తే రింకూ కచ్చితంగా గెలిపించేవాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?

Similar News

News April 19, 2025

JEE మెయిన్‌లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు ఎవరంటే?

image

జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాల్లో 24 మంది విద్యార్థులకు 100 పర్సంటైల్ రాగా, వారిలో నలుగురు తెలుగువారు ఉన్న విషయం తెలిసిందే. వీరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన హర్ష గుప్తాకు 8, అజయ్ రెడ్డికి 16(ఆలిండియా ఈడబ్ల్యూఎస్ కోటా మొదటి ర్యాంక్), బనిబ్రత మజీకి 24వ ర్యాంక్ వచ్చింది. అలాగే ఏపీకి చెందిన సాయి మనోజ్ఞ ఆలిండియా 22వ ర్యాంకుతో పాటు బాలికల్లో 2వ ర్యాంక్ సొంతం చేసుకున్నారు.

News April 19, 2025

సమ్మర్‌లో ఎలాంటి దుస్తులు వేసుకోవాలంటే?

image

వేసవికాలంలో ఎండల దెబ్బకు శరీరం చెమటతో తడిసిముద్దవుతుంది. దీని నుంచి రిలీఫ్ కావాలంటే కొన్ని రకాల దుస్తులు ధరించాలని నిపుణులు చెబుతున్నారు. బయటకు వెళ్లినప్పుడు కాటన్‌తో కూడిన లూజ్ బట్టలు ధరించాలి. వీటి వల్ల చెమట ఈజీగా బయటకు వస్తుంది. ఇంట్లో ఉంటే షార్ట్స్, స్లీవ్ లెస్ టీషర్ట్స్ ధరించవచ్చు. లేత రంగుల దుస్తులు ధరించాలి. బ్లాక్, బ్లూ, రెడ్ వంటి రంగుల దుస్తులు వేసుకుంటే వేడిని గ్రహించి అలసిపోతారు.

News April 19, 2025

రేపే బీసీ గురుకుల ఎంట్రన్స్ పరీక్ష

image

TG: బీసీ గురుకుల స్కూళ్లలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఖాళీగా ఉన్న 6, 7, 8, 9వ తరగతి సీట్లను భర్తీ చేసేందుకు రేపు అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరుగుతుందని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 109 పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. మొత్తం 6,832 బ్యాక్‌లాగ్ సీట్లకు 26,884 అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు.

error: Content is protected !!