News April 8, 2025

జోగులాంబ గద్వాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

@రైతుల వద్ద ప్రతి గింజ కొనుగోలు చేయాలి: జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ @జిల్లా కేంద్రంలో లబ్ధిదారులకు సీఎం సహాయనిది చెక్కులు పంపిణీ చేసిన జడ్పీ మాజీ ఛైర్ పర్సన్ సరిత @డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించాలి: బీఆర్ఎస్ నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు @రాజోలి మండల కేంద్రంలో పురుగు మందు తాగి మహిళ ఆత్మహత్య @నేడు గుజరాత్‌కు వెళ్లిన స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి.

Similar News

News November 3, 2025

GNT: పత్తి రైతులకు కలెక్టర్ సూచన

image

రైతులు CM యాప్‌లో నమోదు కావాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సూచించారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రూపొందించిన పోస్టర్‌ను సోమవారం కలెక్టర్ ఆవిష్కరించారు. సీసీఐ ద్వారా క్వింటాలుకు రూ.8110 మద్దతు ధర ఉందన్నారు. ప్రత్తి కొనుగోలుకు నోటిఫైడ్ చేసిన జిన్నింగ్ మిల్లులలో రైతులు విక్రయించవచ్చన్నారు. CM యాప్‌లో (CM APP) నమోదు చేసుకుని, జిన్నింగ్ మిల్లు, విక్రయ తేదీ ఎంపిక చేసుకోవచ్చని చెప్పారు.

News November 3, 2025

ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం

image

AP: తిరుపతిలోని SV యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. సైకాలజీ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ విద్యార్థులను సీనియర్స్ ర్యాగింగ్ చేశారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారిపై సైకాలజీ డిపార్ట్‌మెంట్ HOD విశ్వనాథ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ‘ర్యాగింగ్ చేస్తారు, ఏమైనా చేస్తారు’ అని అన్నారని, విశ్వనాథ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

News November 3, 2025

చేప పిల్లల పంపిణీ పారదర్శకంగా ఉండాలి: మంత్రి వాకిటి

image

చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రూ. 122 కోట్ల వ్యయంతో 83 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను 26 వేల నీటి వనరుల్లో నవంబర్ 20లోపు విడుదల చేయాలని ఆయన తెలిపారు. వరంగల్ జిల్లాలో ఈ నెల 6 నుంచి చేప పిల్లల పంపిణీ ప్రారంభమవుతుందని కలెక్టర్ సత్య శారద తెలియజేశారు.