News April 9, 2025
కామారెడ్డి: సహకార సంఘాల పునర్వ్యవస్థీకరణపై కమిటీ నిర్ణయం: కలెక్టర్

కామారెడ్డి జిల్లాలో సహకార సంఘాల పునర్వ్యవస్థీకరణకు జిల్లా సహకార అభివృద్ధి కమిటీ నిర్ణయం తీసుకుంటుందని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో జిల్లాలో 10 కొత్త ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని తీర్మానించామని, ప్రతిపాదనలు రాష్ట్ర స్థాయి కమిటీకి పంపిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్, ఇతర శాఖాధికారులు ఉన్నారు.
Similar News
News July 10, 2025
భద్రాద్రి: ‘ఆయిల్‌పామ్ రైతులు ఫోన్ చేయండి’

ఆయిల్‌పామ్ రైతుల సౌకర్యార్థం ఆయిల్ ఫెడ్‌కు టోల్ ఫ్రీ నంబర్ 81430 21010 ఏర్పాటు చేసినట్లు ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి తెలిపారు. ఆయిల్‌పామ్ రైతులు తమ సందేహాలను నంబర్‌కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని సూచించారు. అలాగే తమ ఫిర్యాదులను తెలియజేస్తే పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. SHARE IT
News July 10, 2025
నిర్మల్ జిల్లాకు 7 సబ్ స్టేషన్లు మంజూరు

వినియోగదారులకు మెరుగైన విద్యుత్తును సరఫరా చేసేందుకు ప్రభుత్వం నిర్మల్ జిల్లాకు 7 సబ్ స్టేషన్లు మంజూరు చేసినట్లు ఎస్ఈ సాలియా నాయక్ తెలిపారు. జిల్లాలోని డోడర్నా, రామ్‌సింగ్ తండా, సోఫీనగర్, మహాలింగి, కోలూరు, పల్సి, దత్తోజిపేట్ గ్రామాల్లో సబ్ స్టేషన్ల ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. ఆయా ఫీడర్ల పరిధిలో లో వోల్టేజీ సమస్య తీరుతుందని చెప్పారు.
News July 10, 2025
అంబేడ్కర్ కోనసీమ: నేడు పీఎంటీఎం కార్యక్రమం

జిల్లాలోని అన్ని జూనియర్ స్కూళ్లు, కళాశాల్లో పీఎంటీఎం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఐఈఓ వనుము సోమశేఖరరావు బుధవారం తెలిపారు. పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దామన్నారు. ఈ సమావేశంలో “మా తెలుగు తల్లికి మల్లెపూదండ” గేయాన్ని ఆలపించనున్నట్లు చెప్పారు. రంగవల్లులు, లెమన్ అండ్ స్పూన్ పోటీలు, తల్లిదండ్రులకు టగ్ ఆఫ్ వార్ వంటి పోటీలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.