News April 9, 2025
NRPT: ‘స్కీములతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీములపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ మంగళవారం ప్రకటనలో హెచ్చరించారు. గొలుసుకట్టు స్కీముల పేరుతో మోసగాళ్ళు చెప్పే మాటలు, వాగ్దానాలు, ప్రకటనలు నమ్మకూడదని అన్నారు. సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన పెరగడంతో సైబర్ మోసగాళ్ళు కొత్త పంథా ఎంచుకున్నారని, తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం పొందవచ్చని ప్రజలకు ఆశలు కల్పిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు.
Similar News
News November 6, 2025
భద్రాచలం బస్ సర్వీస్ పునరుద్ధరణ: జిల్లా ఆర్టీసీ అధికారి

పాడేరు నుంచి భద్రాచలానికి ఆర్టీసీ బస్ సర్వీస్ పునరుద్ధరిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి పి.శ్రీనివాస్ రావు బుధవారం తెలిపారు. పాడేరు నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు చేరుతుందన్నారు. అలాగే భద్రాచలం నుంచి ఉదయం 7 గంటలకు బయలుదేరి సాయంత్రానికి పాడేరు చేరుతుందన్నారు. ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం ఉందని ఆర్టీసీ అధికారి తెలిపారు.
News November 6, 2025
నేటి బంద్ వాయిదా: ADB కలెక్టర్

రాష్ట్ర జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి పంట కొనుగోళ్ల నిరవదిక బంద్‌ను వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. రాష్ట్ర మంత్రులు, ఏపీసీ, సెక్రటరీ, సీసీఐ సీఎండీ, జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యాయన్నారు. దీంతో ఈ నెల 6 నుంచి చేపట్టే కొనుగోళ్ల నిరవధిక సమ్మెను వాయిదా వేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
News November 6, 2025
నా పిల్లలు చనిపోవాలని వాళ్లు కోరుకుంటున్నారు: చిన్మయి

SMలో అబ్యూస్పై సింగర్ చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ట్విట్టర్ స్పేస్‌లో మహిళలను కించపరుస్తూ బూతులు తిట్టడాన్ని ఆమె ఖండించారు. ‘రోజూ అవమానాలతో విసిగిపోయాం. TGలో మహిళలకు మరింత గౌరవం దక్కాలి. నా పిల్లలు చనిపోవాలని వీళ్లు కోరుకుంటున్నారు. 15 ఏళ్లైనా పర్వాలేదు నేను పోరాడతా. సజ్జనార్ సార్ సహాయం చేయండి’ అని ట్వీట్ చేశారు. ఈ వివాదం ఏంటో పరిశీలించాలని సజ్జనార్ సైబర్ క్రైమ్ పోలీసులకు సూచించారు.


