News April 9, 2025

తగ్గిన యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయం

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు మంగళవారం సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. ఈరోజు భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. అందులో భాగంగా ప్రధాన బుకింగ్, ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విగ్రహాలు, కళ్యాణకట్ట, వ్రతాలు, యాదరుషి నిలియం, కార్ పార్కింగ్, అన్నదాన విరాళాలు, తదితర విభాగాల నుండి మొత్తం కలిపి రూ.13,17,083 ఆదాయం వచ్చిందన్నారు.

Similar News

News September 16, 2025

నోటిఫికేషన్ విడుదల చేసిన APPSC

image

AP: రాష్ట్రంలో 21 ఉద్యోగాలకు APPSC నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. లైబ్రేరియన్ సైన్స్‌లో జూనియర్ లెక్చరర్ 2, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ 1, డ్రాఫ్ట్స్‌మన్ గ్రేడ్-2 (టెక్నికల్ అసిస్టెంట్)- 12+1, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్)- 3, హార్టికల్చర్ ఆఫీసర్- 2 పోస్టులు ఉన్నాయి. రేపటి నుంచి అక్టోబర్ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని APPSC తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News September 16, 2025

అక్రమాస్తుల కేసుల విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

image

ఏపీ ఏసీబీ నమోదు చేసిన అక్రమాస్తుల కేసుల విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడ సెంట్రల్ ఇన్‌వెస్టిగేషన్ యూనిట్‌కి పోలీస్ స్టేషన్ హోదా లేదని 11 FIRలను హైకోర్టు కొట్టివేయగా ఏసీబీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేసులపై విచారణకు, ఛార్జ్‌షీట్‌ల దాఖలుకు అనుమతినిచ్చింది.

News September 16, 2025

మంజీరా నది ఉరకలేస్తుంది..!

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి మళ్లీ పెరిగింది. దీంతో ప్రాజెక్టులోని తొమ్మిది గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ వరద ఉద్ధృతి కారణంగా పిట్లం మండలం బొల్లక్ పల్లి మంజీరా బ్రిడ్జి వద్ద మంజీర నది ఉరకలేస్తూ ప్రవహిస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి ఔట్‌ఫ్లో 62,542 క్యూసెక్కులుగా ఉంది.