News April 9, 2025
పెద్దాపురం: ల్యాండ్ రీసర్వేపై ఆర్డీవో సమీక్ష

ల్యాండ్ రీసర్వేపై పెద్దాపురం ఆర్డీవో కె. శ్రీరమణి సమీక్షా సమావేశం నిర్వహించారు. మంగళవారం పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పెద్దాపురం డివిజన్ పరిధిలోని 11 మండలాల ల్యాండ్ రీ సర్వే డిప్యూటీ తహశీల్దార్లు, మండల సర్వేయర్లు పాల్గొన్నారు. ఆయా మండలాల్లో ల్యాండ్ రీసర్వే జరుగుతున్న తీరుతెన్నుల గురించి చర్చించారు.
Similar News
News November 15, 2025
సైదాపూర్: ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

సైదాపూర్ మండలం శివరాంపల్లి గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని రెడ్డి అర్చన అనుమానాస్పదంగా మృతి చెందింది. శుక్రవారం కళాశాలకు వెళ్లి పరీక్ష రాసి ఇంటికి వచ్చిన అర్చన, శనివారం తెల్లవారుజామున మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 15, 2025
ఉష్ణోగ్రతలు పడిపోయాయి.. MBNRలో ఇదీ పరిస్థితి..!

MBNR జిల్లాలో ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. అత్యల్పంగా బాలానగర్ మండల కేంద్రంలో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజాపూర్‌లో 11.1, గండీడ్ మండలం సల్కర్‌పేటలో 11.3, మిడ్జిల్‌లో 12.3, కోయిలకొండ సిరివెంకటాపుర్, భూత్‌పూర్‌లో 12.7, మహ్మదాబాద్‌లో 13.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
News November 15, 2025
స్త్రీలు గాజులు ఎందుకు ధరించాలి?

స్త్రీలు గాజులు ధరించడం సాంప్రదాయమే కాదు. శాస్త్రీయంగా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గాజులు మణికట్టుపై నిరంతరం రాపిడి కలిగిస్తాయి. దీంతో ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ స్థాయి పెరుగుతుంది. గాజుల గుండ్రటి ఆకారం శక్తిని శరీరం నుంచి వెళ్లకుండా అడ్డుకుని, తిరిగి మనకే పంపుతుంది. ముఖ్యంగా స్త్రీలకు మణికట్టు వద్ద శక్తిని నిలిపి ఉంచడానికి గాజులు రక్షా కవచంగా పనిచేస్తాయి. ఇది శారీరక సమతుల్యతను కాపాడుతుంది.


