News April 9, 2025
మాచర్ల: సాగర్‌లో సీఆర్పీఎఫ్ బలగాల ఉపసంహరణ

నాగార్జునసాగర్ డ్యాం రక్షణకు ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలను కేంద్రం మంగళవారం ఉపసంహరించుకుంది. గతంలో నాగార్జునసాగర్ డ్యాం రక్షణ తెలంగాణకు చెందిన ఎస్పీఎఫ్ ఆధీనంలో ఉండేది. తరచూ నీటి విడుదల విషయంలో ఆంధ్ర, తెలంగాణ అధికారుల మధ్య ఘర్షణలు జరుగుతూ ఉండటంతో కేంద్రం జోక్యం చేసుకొని డ్యాం భద్రతను సీఆర్పిఎఫ్‌కు అప్పగించింది. బలగాలను వెనక్కి వచ్చేయాలని ఆదేశించడంతో డ్యామ్ భద్రత తెలంగాణ ఎస్పీఎఫ్ ఆధీనంలోకి వెళ్లనుంది.
Similar News
News July 9, 2025
అనకాపల్లి: ‘తల్లి పేరుతో మొక్కను నాటాలి’

మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం సందర్భంగా తల్లి పేరుతో ఒక మొక్కను నాటాలని కలెక్టర్ విజయకృష్ణన్ పిలుపునిచ్చారు. ఇదే ఈ ఏడాది థీమ్‌గా ప్రభుత్వం నిర్ణయించినట్లు బుధవారం పేర్కొన్నారు. విద్యార్థి తల్లితో పాఠశాల ఆవరణలో గానీ వారి ఇంటి వద్ద గానీ మొక్కను నాటాలన్నారు. ఇందుకోసం లీప్ యాప్‌లో వారి పేరు నమోదు చేసుకోవాలన్నారు. పెరుగుతున్న మొక్కకు ప్రతి ఏడాది ఫోటో తీసి అప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు.
News July 9, 2025
ఇక మారుమూల ప్రాంతాల్లోనూ హైస్పీడ్ ఇంటర్నెట్!

బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ భారత్‌లో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు మార్గం సుగమమైంది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ & ఆథరైజేషన్ సెంటర్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. స్టార్‌లింక్ జెన్1 లో ఎర్త్ ఆర్బిట్(LEO) శాటిలైట్ ద్వారా ఐదేళ్ల పాటు సేవలందించేందుకు అనుమతులిచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లోనూ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
News July 9, 2025
WGL: హత్య కేసులో ఇద్దరికీ పదేళ్ల శిక్ష

ఉర్సుగుట్ట సమీపంలో మహాలక్ష్మి బేకరీ వద్ద 2022లో వనం రాకేశ్ అనే వ్యక్తిని హత మార్చి, మరుపట్ల నిఖిల్ అనే వ్యక్తిపై హత్యాయత్నం చేసిన శివనగర్‌కు చెందిన గాడుదల రాజేష్, జున్ను హరికృష్ణ@ బంటికి 10 ఏళ్ల కఠిన కారగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున జరిమానాను వరంగల్ కోర్ట్ జడ్జి నిర్మల గీతాంబ విధించారు. ఈ హత్య ఘటనను అప్పటి ఇన్‌స్పెక్టర్ ముస్క శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.