News April 9, 2025
అరకు: ఉడెన్ బ్రిడ్జిని ప్రారంభించిన పవన్ కల్యాణ్

అరకులోయ మండలం సుంకరమెట్ట దగ్గరలోని APFDC కాఫీ తోటల్లో ఉడెన్ బ్రిడ్జిని మంగళవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ప్రకృతి ఒడిలో ఉన్న ఉడెన్ బ్రిడ్జి అధ్బుతంగా ఉందని పవన్ కితాబు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీఎఫ్డీసీ చైర్మన్ ఆర్వీఎస్కే రంగారావు పాల్గొన్నారు. రూ.43 లక్షలతో బ్రిడ్జిని నిర్మించినట్లు ఏపీఎఫ్డీసీ అధికారులు తెలిపారు.
Similar News
News November 8, 2025
మేడారం భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: జిల్లా కలెక్టర్

మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర అన్నారు. జాతరలో వైద్యశాఖ ముందస్తు ప్రణాళికపై జిల్లా కాన్ఫరెన్స్ హాల్‌లో డీఎంహెచ్‌వోతో కలిసి సమీక్ష జరిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. అవసరమైన పరికరాలు, బెడ్స్‌ను సమకూర్చుకోవాలన్నారు. అత్యవసర సేవల కోసం 108 ప్రభుత్వ వాహనాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
News November 8, 2025
సిరిసిల్ల: ‘నిబంధనలకు అనుగుణంగా సీఎంఆర్ సరఫరా చేయాలి’

రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రైస్ మిల్లర్లు సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్)ను సరఫరా చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గడ్డం నగేష్ ఆదేశించారు. సీఎంఆర్ సరఫరా, ఖరీఫ్ ధాన్యం కేటాయింపు, బ్యాంక్ గ్యారెంటీ వంటి అంశాలపై ఆయన శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో రా రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేటాయించిన ధాన్యం, ఎఫ్‌సీఐకి ఇచ్చిన బియ్యం వివరాలు సమర్పించాలని ఆయన ఆదేశించారు.
News November 7, 2025
ఈ పొజిషన్‌లో నిద్రపోతున్నారా?

నిద్రపోయే సమయంలో పడుకునే పొజిషన్ చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముడుచుకుని లేదా బోర్లా పడుకోవడం వల్ల వెన్నెముక సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. బోర్లా పడుకుంటే మెడ కండరాలపై, నడుముపై ఒత్తిడి పడుతుందని పేర్కొంటున్నారు. ఇక మోకాళ్లను ముడుచుకుని ఒక వైపుకు పడుకోవడం వల్ల దీర్ఘకాలిక వెన్ను నొప్పులు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. వెల్లకిలా లేదా ఎడమవైపుకు తిరిగి పడుకోవాలంటున్నారు.


