News April 9, 2025

కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఉత్పత్తుల ధరలు

image

కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం ఉత్పత్తుల ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి. ✓ ధాన్యం(RNR): గరిష్ఠం: 2489. కనిష్ఠం: 1859. ✓ పత్తి: గరిష్ఠం: 7289. కనిష్ఠం: 5611. ✓ మక్కలు: గరిష్ఠం: 2236. కనిష్ఠం: 1850. ✓ తేజా మిర్చి: గరిష్ఠం: 12,600. కనిష్ఠం: 8002. ✓ తేజా తాలు: గరిష్ఠం: 5811. కనిష్ఠం: 5502. ✓ కందులు: గరిష్ఠం: 6689. కనిష్ఠం: 6069.✓ పేసర్లు: గరిష్ఠం: 7239. కనిష్ఠం: 6089.

Similar News

News September 15, 2025

కళాశాలల బంద్ నేపథ్యంలో పరీక్షా కేంద్రాల మార్పు..!

image

వరంగల్ జిల్లాలో ఫీజు రీయంబర్స్‌మెంట్ విడుదల చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని కళాశాలలో బంద్ నేటి నుంచి నిర్వహిస్తున్నారు. దీంతో ఈనెల 15, 17, 19వ తేదీల్లో జరగాల్సిన ఫార్ము డీ ఫస్ట్ ఇయర్ పరీక్ష కేంద్రాలను మారుస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి రాజేందర్ తెలిపారు. వాటి వివరాలు కేయూ. ఏసీ.ఇన్‌లో చూడొచ్చని, LLB ఐదేళ్ల ఆరో సెమిస్టర్ పరీక్షను సైతం సుబేదారి వర్సిటీ మహిళా కాలేజీకి మార్చమన్నారు.

News September 15, 2025

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు కొలనుపాక విద్యార్థులు

image

కొలనుపాక ZPHSకు చెందిన నలుగురు విద్యార్థులు 35వ సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 14న జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ధనుష్, మనోజ్ కుమార్, కార్తీక్, చండేశ్వర్ అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. వీరు ఈ నెల 25 నుంచి 28 వరకు నిజామాబాద్ జిల్లా ముష్కర్‌లో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారు.

News September 15, 2025

ఖమ్మం: ఆ గ్రామంలో కోతులను పట్టేస్తున్నారు..!

image

ముదిగొండ మండలం గంధసిరి గ్రామంలో కోతుల బెడదకు గ్రామస్థులు పరిష్కారం కనుగొన్నారు. ఇళ్లలోకి చొరబడి బీభత్సం సృష్టించడంతోపాటు మనుషులు, పిల్లలపై దాడి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు పరిష్కారం కోసం గ్రామస్థులు కోతులు పట్టేవారిని పిలిపించి, వాటిని బోనులో పట్టుకున్నారు. వాటిని అడవిలో విడిచిపెట్టి, గ్రామంలో శాంతి నెలకొల్పడానికి కృషి చేస్తున్నారు.