News April 9, 2025
ఏప్రిల్ 10 నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
Similar News
News April 19, 2025
అశ్వారావుపేట: అర్ధరాత్రి గుప్త నిధుల కోసం తవ్వకాలు

అశ్వారావుపేట మండలం సుద్దగోతులగూడెంలో గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. సమాచారం అందుకున్న గ్రామస్థులు అక్కడకు చేరుకునే లోపు వారు పారిపోయారు. పెద్ద గుంత తీసి ఉండడం, అక్కడ పూజా సామగ్రి చూసి గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు.
News April 19, 2025
JEE మెయిన్‌లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు ఎవరంటే?

జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాల్లో 24 మంది విద్యార్థులకు 100 పర్సంటైల్ రాగా, వారిలో నలుగురు తెలుగువారు ఉన్న విషయం తెలిసిందే. వీరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన హర్ష గుప్తాకు 8, అజయ్ రెడ్డికి 16(ఆలిండియా ఈడబ్ల్యూఎస్ కోటా మొదటి ర్యాంక్), బనిబ్రత మజీకి 24వ ర్యాంక్ వచ్చింది. అలాగే ఏపీకి చెందిన సాయి మనోజ్ఞ ఆలిండియా 22వ ర్యాంకుతో పాటు బాలికల్లో 2వ ర్యాంక్ సొంతం చేసుకున్నారు.
News April 19, 2025
సిద్దిపేట: మిత్రులతో ఆడుతుండగా బాలుడి మృతి

కరెంట్ షాక్ తగిలి <<16142215>>విద్యార్ధి మృతి<<>> చెందిన ఘటన తోగుట(M)లో జరిగిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. తుక్కాపూర్‌కు చెందిన చికుడ్క స్వామి గురువారం రాత్రి తన ఇద్దరి కుమారులతో కలిసి ఆలయం వద్దకు వెళ్లారు. గ్రామంలో పోచమ్మ బోనాల పండుగ నిర్వహించేందుకు విద్యుత్ డెకరేషన్ ఏర్పాటు చేశారు. ఆ వైరు ఇనుప పైపునకు తగిలిఉంది. ప్రణీత్ ఆడుకుంటూ ఇనుప పైపునకు తగలడంతో కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు.