News April 9, 2025

జైపూర్: కారు ప్రమాదంలో మహిళ మృతి

image

జైపూర్ మండలంలో కారు ప్రమాదంలో మహిళ మృతి చెందినట్లు SI శ్రీధర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా ఇందుర్తికి చెందిన కిరణ్, కుటుంబీకులతో మంచిర్యాలలో ఫంక్షన్‌కు హాజరై తిరిగి ఇంటికి బయలుదేరాడు. ఇందారం వద్ద చెన్నూరు నుంచి అతివేగంగా అజాగ్రత్తగా వచ్చిన తుఫాన్ వాహనం కారును ఢీకొంది. కిరణ్ భార్య సంధ్యారాణికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మరణించినట్లు నిర్ధారించారు.

Similar News

News November 6, 2025

జ్ఞానాన్ని ప్రసాదించే వ్యాస మంత్రం

image

వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్‌ ||3||
వసిష్ఠుడికి మునిమనవడు, శక్తి మహామునికి మనుమడు, పరాశరుడికి పుత్రుడు, పరమ పవిత్రుడు, గొప్ప తపస్సు సంపద కలిగినవాడు, శుకమహర్షి తండ్రి అయిన ఆ వేదవ్యాస మహర్షికి మనం నమస్కరించాలి. ఆ వ్యాసుడి గొప్ప వంశాన్ని, పవిత్రతను స్మరించుకొని, పూజించడం వలన ఆయనలా జ్ఞానం లభిస్తుందని నమ్మకం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

News November 6, 2025

పరకామణి చోరీ కేసు.. 30మందితో విచారణ

image

తిరుమల పరకామణి చోరీ కేసులో విచారణ మొదలైంది. ఐదు బృందాలుగా అధికారులు ఏర్పడ్డారు. 20 మంది ప్రత్యక్షంగా, 10 మంది అధికారులు ఆఫీస్ నుంచి విచారణ కొనసాగించనున్నారు. డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఎస్పీ గంగాధర్, ముగ్గురు డీఎస్పీలు, ఫోరెన్సిక్, సైబర్, ఐటీ విభాగం, లీగల్ విభాగం సభ్యులు విచారణలో పాల్గొంటారు. 28రోజుల్లో విచారణ పూర్తి చేసి హైకోర్టులో నివేదిక సమర్పించనున్నారు.

News November 6, 2025

శ్రీ సత్యసాయి జిల్లాలో 15 మంది పోలీసుల బదిలీ

image

శ్రీ సత్యసాయి జిల్లాలో 15 మంది పోలీసులకు స్థానచలనం కలిగింది. ఈ మేరకు ఎస్పీ సతీశ్ బాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో ఏఎస్సై, ముగ్గురు హెడ్ కానిస్టేబుల్స్, 11 మంది కానిస్టేబుల్స్ ఉన్నారు. వీరంతా బదిలీ అయిన స్థానాల్లో 3 రోజుల్లో బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.